ETV Bharat / bharat

India Canada Visa News : కెనడాలో వీసాల జారీ ప్రారంభం.. కానీ ఓ ట్విస్ట్

India Canada Visa News Today : కెనడాలో​ వీసా సేవలను భారత్ పునఃప్రారంభించింది. భారత దౌత్యవేత్తల భద్రతపై కెనడా తీసుకున్న చర్యలను పరిశీలించి.. వారి భద్రత పరిస్థితిని పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.

India Canada Visa News Today
India Canada Visa News Today
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 25, 2023, 7:58 PM IST

Updated : Oct 25, 2023, 10:19 PM IST

India Canada Visa News Today : కెనడాలో​ వీసా సేవలను భారత్​ బుధవారం పునఃప్రారంభించింది. ఎంట్రీ వీసా, బిజినెస్​ వీసా, మెడికల్​ వీసా, కాన్ఫ్​రెన్స్​ వీసాలను మాత్రమే మంజూరు చేస్తున్నట్లు కెనడాలోని భారత హై కమిషన్ ప్రకటించింది. ఈ సేవలు గురువారం (అక్టోబర్​ 26) నుంచి ప్రారంభమవుతాయని తెలిపింది. అయితే కెనడాలోని తమ దౌత్యవేత్తల భద్రతలో పురోగతిని వస్తే కెనడాలో వీసా సేవలను 'అతి త్వరలో' పునరుద్ధరించాలని అనుకుంటున్నట్లు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆదివారం అన్నారు. ఈ నేపథ్యంలో భారత్​ వీసా సేవలను పునరుద్ధరించడం గమనార్హం.

India Canada Relations : 'భారత దౌత్యవేత్తల భద్రత విషయంలో ఇటీవల కెనడా చేపట్టిన చర్యలను పరిగణలోకి తీసుకున్నాము. భద్రత పరిస్థితులను పరిశీలించిన తర్వాత వీసా సేవలు పునరుద్ధరించాలని నిర్ణయించాము. ఎంట్రీ వీసా, బిజినెస్​ వీసా, మెడికల్​ వీసా, కాన్ఫ్​రెన్స్​ వీసాలను అక్టోబర్ 26 నుంచి మంజూరు చేస్తున్నాము' అని కెనడాలోని భారత హైకమిషన్ ఓ ప్రకటనలో తెలిపింది.

  • India resumes visa services in Canada for the following categories- Entry visa, Business visa, Medical visa and Conference visa: High Commission of India, Ottawa pic.twitter.com/amUGdXEUjp

    — ANI (@ANI) October 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

భారత్​ వార్నింగ్​.. తలొగ్గిన కెనడా..
అంతకుముందు భారత్‌లోని తమ దౌత్య సిబ్బందిలో 41 మందిని వారి కుటుంబ సభ్యులతో సహా వెనక్కు రప్పించుకున్నట్టు ఇటీవల కెనడా అధికారికంగా ప్రకటించింది. దౌత్య సిబ్బందిని తగ్గించుకోకపోతే వారికి అందించే దౌత్యపరమైన రక్షణను ఉపసంహరిస్తామంటూ భారత్‌ హెచ్చరించిన క్రమంలో సిబ్బంది కుదింపు చర్య చేపట్టినట్లు ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రి మెలానీ జోలీ వెల్లడించారు. దౌత్యవేత్తలకు రక్షణను ఉపసంహరించుకోవడమేనది అనూహ్యమైన చర్య అని.. అది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని మెలానీ జోలీ ఆరోపించారు.

Canada Diplomats In India : అయితే కెనడా విదేశాంగ మంత్రి చేసిన ఆరోపణలను భారత్​ గట్టిగా తిప్పికొట్టింది. భారత ప్రభుత్వ వ్యవహారాల్లో కెనడా సిబ్బంది జోక్యం చేసుకుంటారన్న ఆందోళనల దృష్ట్యా.. ఇరు దేశాల దౌత్యసిబ్బంది సంఖ్య విషయంలో సమానత్వం పాటించాలని భారత్​ కోరిందని ఎస్. జైశంకర్ తెలిపారు. వియన్నా ఒప్పందంలోని నిబంధనలకు అనుగుణంగానే.

India Canada Dispute: భారత్‌తో ఉద్రిక్తతల వేళ కెనడా మంత్రి కీలక వ్యాఖ్యలు.. 'ఆరోపణలు నిజమని తేలితే..'

Canada Diplomatic Immunity : దౌత్యవేత్తల ఉపసంహరణపై కెనడా ప్రధాని కీలక వ్యాఖ్యలు.. భారత్​ స్ట్రాంగ్​ కౌంటర్​. దౌత్యసిబ్బంది సంఖ్యలో సమానత్వాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.

Last Updated : Oct 25, 2023, 10:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.