రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలోని నాయకుల చేతిలో దేశం బందీ అవుతోందని ఆరోపించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. దండి మార్చ్ ఉద్యమం చేసి నేటికి 91 ఏళ్లయిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
"గాంధీజీ చేపట్టిన దండి ఉద్యమం ప్రపంచ దేశాలకు స్వేచ్ఛకు సంబంధించిన సందేశాన్నిచ్చింది. ప్రస్తుతం దేశం ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలోని పాలకుల చేతిలో బందీ అవుతోంది. ఇప్పుడు దేశ ప్రజలు స్వేచ్ఛ కోసం పోరాడే సమయం ఆసన్నమైంది. గాంధీ స్ఫూర్తితో ప్రజలు ఈ పోరాటం చేయాల్సి ఉంది."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత.
1930 మార్చి 12న సబర్మతి ఆశ్రమం నుంచి గుజరాత్లోని దండి వరకు మార్చ్ చేశారు మహాత్మా గాంధీ. బ్రిటిష్ ప్రభుత్వం ఉప్పుపై పన్ను విధించడాన్ని నిరసిస్తూ ఈ ఉద్యమం చేపట్టారు.
నిరుద్యోగంపై...
దేశంలోని విద్యార్థులు ప్రస్తుతం ఉద్యోగాలు కోరుకుంటుంటే... ప్రభుత్వం మాత్రం వారిపై పోలీసులతో లాఠీ ఛార్జ్, జల ఫిరంగులతో దాడి చేయిస్తోందని విమర్శించారు రాహుల్.
-
#StudentsWantJobs
— Rahul Gandhi (@RahulGandhi) March 12, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
लेकिन सरकार दे रही है-
पुलिस के डंडे
वॉटर गन की बौछार
एंटी नैशनल का टैग
और बेरोज़गारी।
">#StudentsWantJobs
— Rahul Gandhi (@RahulGandhi) March 12, 2021
लेकिन सरकार दे रही है-
पुलिस के डंडे
वॉटर गन की बौछार
एंटी नैशनल का टैग
और बेरोज़गारी।#StudentsWantJobs
— Rahul Gandhi (@RahulGandhi) March 12, 2021
लेकिन सरकार दे रही है-
पुलिस के डंडे
वॉटर गन की बौछार
एंटी नैशनल का टैग
और बेरोज़गारी।
ఇదీ చదవండి:తాత కోట నుంచే ఉదయనిధి స్టాలిన్ పోటీ