అంటువ్యాధులు కాని రోగాల(నాన్ కమ్యునికబుల్ డిసీజెస్-ఎన్సీడీ) నివారణకు భారత్ విశేష కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ దిశగా చేపట్టే కార్యక్రమాల విషయంలో భారత్ ముందంజలో ఉందని అన్నారు. ఎన్సీడీ మరణాలను గణనీయంగా తగ్గించినందుకు భారత్‌పై ఐరాస ప్రశంసలు కురిపించిన నేపథ్యంలో మోదీ ఈ మేరకు ట్వీట్ చేశారు.
-
India is at the forefront of initiatives that seek to prevent non-communicable diseases and further wellness.
— Narendra Modi (@narendramodi) March 24, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Grateful to @UNITAR for their kind words.
Together, we all have to make our planet healthier. https://t.co/pgiwIhknSx
">India is at the forefront of initiatives that seek to prevent non-communicable diseases and further wellness.
— Narendra Modi (@narendramodi) March 24, 2021
Grateful to @UNITAR for their kind words.
Together, we all have to make our planet healthier. https://t.co/pgiwIhknSxIndia is at the forefront of initiatives that seek to prevent non-communicable diseases and further wellness.
— Narendra Modi (@narendramodi) March 24, 2021
Grateful to @UNITAR for their kind words.
Together, we all have to make our planet healthier. https://t.co/pgiwIhknSx
"అసంక్రమిక వ్యాధులను నివారించేందుకు చేపట్టే కార్యక్రమాల్లో భారత్ ముందంజలో ఉంది. యూఎన్ఐటీఏఆర్ చేసిన వ్యాఖ్యలు సంతోషకరం. అందరం కలిసి ఈ భూగ్రహాన్ని ఆరోగ్యవంతంగా మార్చాలి."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
ఎన్సీడీ నివారణలో భారతదేశ పురోగతిని గుర్తిస్తూ ఐరాసకు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్(యూఎన్ఐటీఏఆర్) విభాగం ఓ ప్రకటన చేసింది. అకాల మరణాలను తగ్గించేందుకు భారత్ చేసిన కృషిని ప్రశంసించింది. సాధారణ ఎన్సీడీలను నివారించేందుకు అమలు చేస్తున్న 'నేషనల్ మల్టీసెక్టోరియల్ యాక్షన్ ప్లాన్'పై అవగాహన పెంచుకునేందుకు భారత సహకారాన్ని కోరింది.
ఇదీ చదవండి: తదుపరి సీజేగా జస్టిస్ రమణ- జస్టిస్ బోబ్డే సిఫార్సు