ETV Bharat / bharat

''ఇండియా'ను ఏం చేద్దాం?'- ఎన్నికల ఫలితాలపై విపక్ష నేతల కీలక భేటీ

India Alliance Meeting In Delhi : ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలు, రానున్న లోక్​సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చే ప్రధాన అజెండాగా ఇండియా కూటమి నేతలు సమావేశం కానున్నారు. దిల్లీలో బుధవారం సాయంత్రం ఈ భేటీ జరగనుంది.

India Alliance Meeting In Delhi
India Alliance Meeting In Delhi
author img

By PTI

Published : Dec 3, 2023, 1:18 PM IST

Updated : Dec 3, 2023, 2:13 PM IST

India Alliance Meeting In Delhi : విపక్ష 'ఇండియా' కూటమి నేతలు డిసెంబర్​ 6న దిల్లీలో సమావేశం కానున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో బుధవారం సాయంత్రం భేటీ అయి.. 2024 లోక్​సభ ఎన్నికల కోసం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కలిసికట్టుగా బీజేపీని ఎదుర్కోవడంపై నేతలు సమాలోచనలు జరపనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

సార్వత్రిక సమరానికి సెమీ ఫైనల్​గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో విపక్ష ఇండియా కూటమి నేతల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇండియా కూటమిలో కీలక భాగస్వామి అయిన కాంగ్రెస్​.. తెలంగాణలో సత్తా చాటినా, హిందీ రాష్ట్రాల్లో మాత్రం వెనుకబడింది. ఈ నేపథ్యంలో లోక్​సభ ఎన్నికల్లో ఎలా ముందుకు సాగాలన్న అంశంపై విపక్ష నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

లోకసభ ఎన్నికల్లో అధికార బీజేపీని ఎదుర్కొనేందుకు సుమారు 26 పార్టీలు ఏకమై 'ఇండియా' కూటమిగా ఏర్పడ్డాయి. కేంద్రంలో వరుసగా మూడోసారి బీజేపీ అధికారంలోకి రాకుండా చేయడానికి పార్టీలు కలిశాయి. ఇప్పటి వరకు ఈ కూటమి పట్నా, బెంగళూరు, ముంబయిలో మూడు సమావేశాలను నిర్వహించింది. ముంబయి సమావేశంలో ప్రతిపక్ష పార్టీలు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని తీర్మానాలను ఆమోదించింది ఇండియా కూటమి. అయితే నాలుగో సమావేశాన్ని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కారణంగా వాయిదా వేసింది. డిసెంబర్​ 6న దిల్లీలోని మల్లికార్జున్​ ఖర్గే ఇంటిలో జరిగే ఈ సమావేశంలో కీలక విషయాలతో పాటు.. పార్టీల మధ్య సీట్ల పంపీణీపై చర్చలు జరగవచ్చని సమాచారం.

మరోవైపు.. ఇండియా కూటమి నేతల భేటీకి ముందు కీలక వ్యాఖ్యలు చేశారు సీనియర్ నేత శరద్ పవార్. నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు 'ఇండియా' కూటమిపై ఎలాంటి ప్రభావం చూపవని అన్నారు. "ప్రస్తుతం బీజేపీకి అనుకూలంగా ఉంది. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం బీజేపీ వెనకుబడి ఉంది. ఇంతకుముందుకు వరకు తెలంగాణలో బీఆర్​ఎస్​ వస్తుందని అనుకున్నారు. కానీ రాహూల్​ గాంధీ చేసిన యాత్ర వల్ల మార్పు వచ్చింది." అని శరద్​ పవార్ పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ వల్లే ఇండియా కూటమి జోరు తగ్గింది : నీతీశ్‌ కుమార్‌

India Alliance in Madhya Pradesh : ఇండియా కూటమి ఉన్నట్టా లేనట్టా? దిల్లీలో దోస్తీ.. అసెంబ్లీ ఎన్నికల్లో కుస్తీ!

Last Updated : Dec 3, 2023, 2:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.