పన్ను ఎగవేత కేసులో తమిళనాడుకు చెందిన క్రైస్తవ మతబోధకుడు పాల్ దినకరన్ నివాసంలో ఐటీ అధికారులు సోదాలు జరిపారు. దినకరన్‌కు చెందిన కార్యాలయాలతో పాటు 28 చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో దాదాపు 200 మంది ఐటీ అధికారులు పాల్గొన్నారు.
చెన్నై అడయార్‌లోని ప్రధాన కార్యాలయం, కారుణ్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, జీసస్ కాల్స్ మినిస్ట్రీ కార్యాలయంలోనూ ఐటీ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు.
ఇదీ చదవండి : విమానాశ్రయ శౌచాలయంలో నోట్ల కట్టలు!