ETV Bharat / bharat

20 ఏళ్లుగా సహజీవనం- వారి తిట్లు భరించలేక... - ఉన్నావో

20 ఏళ్లకుపైగా పెళ్లి చేసుకోకుండా కలిసే ఉంటున్న ఓ వృద్ధ జంట.. ఎట్టకేలకు మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది. అయితే అదీ కూడా ఇరుగుపొరుగు నిందలు పడలేక. ఇంతకీ ఎక్కడంటే..

elderly couple got married
వృద్ధ దంపతుల పెళ్లి
author img

By

Published : Jul 16, 2021, 2:57 PM IST

గ్రామస్థుల నిందలు తట్టుకోలేక వృద్ధ దంపతులు పెళ్లి చేసుకున్న విచిత్ర సంఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. 20 ఏళ్లుగా సహజీవనం చేస్తున్న ఆ జంట ఈ మధ్యనే వివాహం బంధంలోకి అడుగుపెట్టింది. అయితే అది గ్రామ పెద్ద ప్రోద్బలంతోనే.

ఇదీ సంగతీ..

ఉన్నావ్ జిల్లా మొరాదాబాద్​లో 60 ఏళ్ల నారాయణ్ రాయ్​దాస్, 55 ఏళ్ల రామ్​రతీ 2001 నుంచి కలిసి ఉంటున్నారు. వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో వారి 13 ఏళ్ల అబ్బాయి అజయ్​కు అవమానం, అపనిందలు రాకూడదంటే వారిద్దరూ పెళ్లి చేసుకోవాల్సిందేనని గ్రామపెద్ద రమేశ్​తో పాటు సామాజిక కార్యకర్తలు ఒప్పించారు . కల్యాణానికి ఖర్చులన్నీ తామే భరిస్తామని హామీ ఇచ్చారు.

దీంతో వారు పెళ్లికి ఒప్పుకున్నారు. డీజే పాటల ధూంధాం మధ్యలో వారి వివాహం ఘనంగా జరిగింది.

ఇదీ చూడండి: 'అక్రమ తల్లిదండ్రులు ఉంటారేమో.. అక్రమ సంతానం ఉండరు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.