ETV Bharat / bharat

ఆటోడ్రైవర్లకు ఉచిత పెట్రోల్​.. ఎక్కడంటే?

ఓ వైపు దేశవ్యాప్తంగా పెట్రోల్​ ధరలు జీవనకాల గరిష్ఠాలను తాకుంటే ఓ బంక్ యజమాని మాత్రం కరోనాతో చితికిపోయిన ఆటో డ్రైవర్లకు అండగా నిలుస్తున్నాడు. ఒక ఆటోకి మూడు లీటర్ల పెట్రోల్​ను ఉచితంగా అందిస్తూ.. 'పెట్రోల్​ దాత'గా నిలుస్తున్నాడు.

author img

By

Published : Jun 22, 2021, 1:25 PM IST

free petrol ro auto drivers
సిద్ధిక్​

కరోనాతో ఆగిన ఆటో చక్రాన్ని పరుగు పెట్టించేందుకు కంకణం కట్టుకున్నాడు ఆ వ్యక్తి. కేరళలో కరోనా విజృంభిస్తుండడం, మరోవైపు స్థానికంగా విధించిన లాక్​డౌన్​తో జీవనం గడవని ఆటో డైవర్​లకు అండగా నిలుస్తున్నాడు. ఓ వైపు పెట్రోల్​ ధరలు పెరుగుతున్నా.. లెక్క చేయక 3 లీటర్ల పెట్రోల్ ఉచితంగా ఇస్తున్నాడు. ఆయనే కేరళ కాసరగోడ్​లోని కుడుకోలి పెట్రోల్​ పంపు యజమాని అబ్ధుల్లా మాడుమౌలీ.

pump owner giving free petrol
ఆటోలకు ఉచితంగా పెట్రోల్​ పడుతున్న సిబ్బంది
pump owner giving free petrol
అబ్ధుల్లా పెట్రోల్​ పంపు

వృత్తరీత్యా అబుదాబిలో చార్టెడ్​ అకౌంటెంట్​ అయిన అబ్ధుల్లా.. రోజువారి తన బంకుకు వచ్చే వారిలో ఎక్కువగా ఉండే ఆటోడ్రైవర్​లకు సాయం చేయాలని అనుకున్నారు. ఇందుకు తన పెట్రోల్​ బంకుకు వచ్చిన వారికి ఉచితంగా పెట్రోల్​ ఇవ్వసాగారు. ఇది తెలుసుకున్న చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా ఆ బంకుకు రాసాగారు. దీనిని ఏ మాత్రం పబ్లిసిటీగా ఉపయోగించుకోవడం లేదని బంకును చూసుకునే అబ్ధుల్లా తమ్ముడు సిద్ధిక్ ​అంటున్నారు. సాయం చేయాలనే లక్ష్యంతోనే ఈ విధంగా చేస్తున్నట్లు చెప్పారు. కార్మిక వర్గం ఇబ్బందులు మాకు తెలుసు అని అంటున్నారు.

pump owner giving free petrol
మూడు లీటర్లు ఉచితంగా ఇస్తున్న కుడుకోలి పెట్రోల్​ పంపు

పెట్రోదాత సుఖీభవ..

లాక్​డౌన్​తో ఇబ్బంది పడిన ఆటో డ్రైవర్లు అబ్ధుల్లా, అతని సోదరుడు చేస్తున్న సాయాన్ని కొనియాడుతున్నారు. ధరలు ఆకాశాన్ని అంటుతున్నా.. ఉచితంగా ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నారు. వారి దాతృత్వానికి కృతజ్ఞతలు చెప్తున్నారు.

ఇదీ చూడండి: కులాంతర వివాహం చేసుకుందని గుండు కొట్టారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.