ETV Bharat / bharat

నరబలి కోసం బాలిక అపహరణ!

కర్ణాటక నేలమంగళలో నరబలి కోసం ఓ పదేళ్ల అమ్మాయిని ఎత్తుకెళ్లారు. తమ కూతురు కనిపించకపోయే సరికి వెతికిన తల్లిదండ్రులు.. ఓ వ్యవసాయ క్షేత్రంలో బాలికను గుర్తించారు. సురక్షితంగా ఇంటికి తీసుకొచ్చారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆరుగురిని అరెస్టు చేశారు.

girl
బాలిక
author img

By

Published : Jun 20, 2021, 4:40 PM IST

నరబలి కోసం బాలిక అపహరణ

నరబలి కోసం ఓ పదేళ్ల బాలికను అపహరించిన ఘటన కర్ణాటకలోని నేలమంగళలో జరిగింది. జూన్​ 14న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

సోలదేవనహళ్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గాంధీ గ్రామ్​కు చెందిన ఓ పదేళ్ల బాలిక ఇంటిముందు ఆడుకుంటూ ఉంది. ఐదుగురు దుండగులతో పాటు ఓ మంత్రగాడు.. ఆ బాలికను బలవంతంగా ఎత్తుకెళ్లారు. అమ్మాయి కనిపించక పోవడం వల్ల తల్లిదండ్రులు ఊరంతా వెతికారు. ఆఖరికి ఓ వ్యవసాయ క్షేత్రంలో బాలికపై క్షుద్రపూజలు చేస్తుండగా కనిపెట్టారు. బాలికను ఇంటికి తీసుకొచ్చారు.

అదే గ్రామానికి చెందిన సురేశ్​, హనుమంతయ్య, శివరాజు, రవి, సౌమ్య, ఓ మంత్రగాడు కలిసి పాపను బలి ఇవ్వాలని ఎత్తుకెళ్లారని ఆ అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని ఆ ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

ఇదీ చదవండి: విచక్షణ మరచి.. తల్లిదండ్రులను చావబాది..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.