కర్ణాటకలోని బెళగావిలో ఎక్కడచూసిన చెత్తే ఉందంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు ఎమ్మెల్యే అభయ్ పాటిల్. అంతటితో ఆగకుండా నగర కార్పొరేషన్ కమిషనర్ జగదీశ్ ఇంటి వద్ద ఆదివారం స్వయంగా.. వ్యర్థాలు కూడిన ఓ ట్రాక్టర్ను విడిచిపెట్టారు. అధికారులు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో విఫలమవుతున్నారంటూ ఆయన ఆక్షేపించారు.
![Garbage at commissioner house](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-bgm-01-25-commissioner-mane-munde-kasa-hakid-mla-ka10029_25072021100200_2507f_1627187520_559_2507newsroom_1627196051_372.jpg)
"నగరంలో పరిశుభ్రత పాటించాలని 3 నెలల కిందే హెచ్చరించాం. అయినా ఎలాంటి మార్పు లేదు. ఏ మూల చూసినా చెత్తే ఉంది. సాధారణ ప్రజలంటే అధికారులకు లోకువ అయిపోయింది. ఇక నుంచైనా పరిశుభ్రత పాటించకపోతే ప్రతి ఆదివారం వాళ్ల ఇళ్ల ముందు ఓ ట్రాక్టర్ చెత్త పారేయాల్సి ఉంటుంది."
- అభయ్ పాటిల్, శాసనసభ్యుడు
![Garbage at commissioner house](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-bgm-01-25-commissioner-mane-munde-kasa-hakid-mla-ka10029_25072021100200_2507f_1627187520_555_2507newsroom_1627196051_448.jpg)
అయితే అనంతరం కమిషనర్ ఇంటి వద్ద ఉన్న చెత్తను మున్సిపాలిటీ సిబ్బంది తొలగించారు.
![Garbage at commissioner house](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-bgm-01-25-commissioner-mane-munde-kasa-hakid-mla-ka10029_25072021100200_2507f_1627187520_147_2507newsroom_1627196051_326.jpg)
ఇదీ చూడండి: పేరుకు ప్రైవేటు స్కూల్.. ఫీజు మాత్రం ఏడాదికి రూ.500!