ETV Bharat / bharat

బాలికను చంపి.. కన్ను పొడిచి.. చెట్టుకు వేలాడదీసి! - బాలిక హత్య

16 ఏళ్ల బాలికను దారుణంగా చంపి, చెట్టుకు వేలాడదీసిన ఘటన ఝార్ఖండ్​లో వెలుగుచూసింది. ఆమెను స్థానిక భాజపా నేత కుమార్తెగా పోలీసులు గుర్తించారు.

girl hanged in jharkhand
ఝార్ఖండ్​లో బాలిక హత్య
author img

By

Published : Jun 10, 2021, 12:13 PM IST

Updated : Jun 10, 2021, 1:17 PM IST

ఝార్ఖండ్​లో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పాలము జిల్లాలోని లాలీమాటి అటవీ ప్రాంతంలో బుధవారం ఓ బాలిక మృతదేహం చెట్టుకు వేలాడుతూ కనిపించింది. ఆమెను అతికిరాతకంగా చంపిన దుండగులు.. కళ్లను పొడిచారు. చెట్టుకు వేలాడుతూ కనిపించిన మృతదేహాన్ని చూసిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

girl hanged in jharkhand
చెట్టుకు వేలాడుతున్న బాలిక మృతదేహం

ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పంచనామా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. కాగా ఆ బాలిక ఓ భాజపా నేత కుమార్తె అని తెలుస్తోంది. బాలిక సోమవారం నుంచి కనిపించకుండా పోగా, దానిపై పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు బంధువులు.

ఇదీ చూడండి: అనుమానంతో చెట్టుకు వేలాడదీసి చితకబాదారు

Last Updated : Jun 10, 2021, 1:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.