భాజపా, ఆరెస్సెస్ విధానాల ఫలితంగా దేశంలోని ఆదివాసీలు, దళితులకు విద్య అందకుండా పోతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉపకారవేతనాన్ని నిలిపివేసి వారికి న్యాయం చేకూర్చుతారా? అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ఈ మేరకు ఓ మీడియా కథనాన్ని తన ట్వీట్‌కు జత చేశారు.
"భాజపా, ఆరెస్సెస్ విధానాల వల్ల ఆదివాసీలు, దళితులు విద్యకు దూరమవుతున్నారు. ఉపకార వేతనాల్ని నిలిపివేయడమేనా మీరు వారికి చేసే న్యాయం?"
--రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత.
రాహుల్ జత చేసిన కథనంలో.. 11,12 తరగతులకు చెందిన 60 లక్షల మంది ఎస్సీ విద్యార్థుల కోసం నిర్దేశించిన కేంద్ర ప్రభత్వ ఉపకార వేతన పథకం.. 14 రాష్ట్రాల్లో నిలిచిపోయినట్లుగా ఉంది.
ఇదీ చూడండి:ఉత్తర్‌ప్రదేశ్‌లో తొలి 'లవ్ జిహాద్' కేసు