తన తల్లిని ఏకగ్రీవంగా సర్పంచ్‌ను(gram sarpanch) చేసిన ఊరి కోసం రూ. కోటి ఖర్చు చేసి పంచాయతీ భవనం(gram panchayat building) నిర్మించారు ఓ ఎన్ఆర్ఐ. గ్రామం కోసం తన సొంత డబ్బులను ఖర్చు చేసి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఈ సంఘటన రాజస్థాన్‌లోని బాడ్మేర్ జిల్లాలో జరిగింది.
బుఢాతలా గ్రామానికి(gram panchayat in rajasthan) సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఎన్ఆర్ఐ నవల్ కిశోర్ గోదారా తల్లి. తన మాతృమూర్తి బాధ్యతలు నిర్వర్తిస్తున్న గ్రామానికి ఏదైనా చేయాలనుకున్న ఆ ఎన్ఆర్ఐ.. రూ. కోటి ఖర్చు చేసి ఆధునిక గ్రామపంచాయతీ భవనాన్ని నిర్మించారు. పక్కనే హరితవనం, గ్రామ సేవక్ పట్వారీ- సర్పంచ్ మీటింగ్ హాల్‌ను ఏర్పాటు చేశారు.
ఈ కొత్త పంచాయతీ భవనాన్ని(gram panchayat building) ఈనెల 12న ప్రారంభించారు. కార్యక్రమానికి హాజరైన కలెక్టర్, ఎమ్మెల్యేలు సర్పంచ్‌ను ప్రశంసించారు. ఇలాంటి సర్పంచ్‌ను తన రాజకీయ జీవితంలోనే చూడలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే అమిన్ ఖాన్ తెలిపారు. ఆధునిక గ్రామ పంచాయతీ భవనం నిర్మాణ సమయంలో చాలా మంది అడ్డు తగిలారని, అయినప్పటికీ నిర్మాణం పూర్తి చేశారని చెప్పారు.
తన తల్లిని సర్పంచ్(gram sarpanch) చేసిన ఊరి కోసం ఏదైనా చేయటం తన బాధ్యతగా పేర్కొన్నారు ఎన్ఆర్ఐ కిశోర్.
" నా వ్యాపారం విదేశాల్లోనే ఉంది. కానీ, గ్రామస్థులు నా తల్లిని ఏకగ్రీవంగా సర్పంచ్‌ను చేశారు. ఈ ఊరి ప్రజల కోసం ఏదైనా చేయాలనే బాధ్యత నా భుజాలపై ఉంది. అందుకే రూ.కోటి ఖర్చు చేసి ఆధునిక గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మించాను."
- నవల్ కిశోర్, ఎన్ఆర్ఐ
గ్రామ పంచాయతీ భవన నిర్మాణం మాత్రమే కాదు.. నిరుపేదలైన గ్రామస్థులకు బీమా సౌకర్యం అందించేందుకు చిరంజీవి యోజనలో తను డబ్బులు జమ చేస్తున్నారు కిశోర్. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని చాలా మంది ఈ పథకంలో చేరుతున్నారు.
ఇదీ చూడండి: వృద్ధురాలి ఔదార్యం.. రిక్షా కార్మికుడికి రూ.కోటి ఆస్తి దానం