ETV Bharat / bharat

పాదయాత్ర చేస్తూ యోగాకు ప్రచారం.. దేశవ్యాప్తంగా యువకుడి పర్యటన - మైసూరు యువకుడు యోగా సాధన కోసం దేశవ్యాప్త పాదయాత్ర

యోగా విశిష్టతను చాటి చెప్పడానికి సరికొత్త రీతిలో ప్రచారం చేస్తున్నాడు ఓ యువకుడు. దేశ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తూ.. యోగా ప్రాముఖ్యతను వివరిస్తున్నాడు. దాంతో పాటు పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలో ప్రజలకు చెబుతున్నాడు. అతడే కర్ణాటకకు చెందిన కృష్ణ నాయర్. అతడి యోగా యాత్ర గురించి తెలుసుకుందాం.

Karnataka man travels across country to preach yoga

author img

By

Published : Apr 29, 2023, 9:56 AM IST

యోగా ఒక జీవన విధానం. అనేక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడటానికి ఒక మార్గం. భారత్​లో ఆవిర్భవించిన యోగా.. ప్రస్తుతం విశ్వవ్యాప్తమైంది. దాదాపు 180 దేశాలల్లో యోగా సాధన చేస్తున్నారు. ఇంతటి మహత్తరమైన యోగాను.. ప్రతి ఒక్కరు తమ రోజువారీ జీవితంలో భాగంగా చేసుకోవాలని ఓ యువకుడు.. వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నాడు. దేశవ్యాప్తంగా పాదయాత్ర చేస్తూ.. యోగా ప్రయోజనాలను వివరిస్తున్నాడు.

Karnataka man travels across country to preach yoga
జాతీయ జెండాతో కృష్ణ నాయర్

కృష్ణ నాయర్ అనే యోగా టీచర్​.. మైసూరు నుంచి పాదయాత్ర ఆరంభించాడు. గత ఆరు నెలలుగా కర్ణాటకతో పాటు కేరళ, ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ, మహారాష్ట్రలో పర్యటించాడు. కొద్ది రోజుల క్రితం ఒడిశాలో పర్యటన ముగించి ప్రస్తుతం బాంగాల్​లోని హుగ్లీలో కొనసాగిస్తున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడిన నాయర్.. విద్యార్థినులకు కూడా యోగా, పర్యావరణ సంరక్షణ మీద అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పాడు. మనుషులు అనేక రోగాల బారిన పడుతున్నారని.. వాటిని ఎదుర్కొడానికి క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం అవసరం అని తెలిపాడు. దీంతో పాటు చెట్లు నాటడం కూడా ముఖ్యం అని చెబుతున్నాడు.

పాదయాత్ర చేస్తున్న కృష్ణ నాయర్

"నేను భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో పాదయాత్రలు చేశాను. ఇప్పటివరకు వివిధ రాష్ట్రాల్లో పర్యటించాను. ఇప్పుటికీ దాదాపు ఆరు నెలలుగా పర్యటిస్తున్నాను. యోగా, పర్యావరణంపై కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించడమే ఈ పాదయాత్ర లక్ష్యం."
-కృష్ణ నాయర్, యోగా టీచర్

యోగా ద్వారా వ్యక్తిగతంగా తనకు కలిగిన ప్రయోజనాలను వివరించాడు నాయర్. తాను ఓ క్రికెటర్​ కావాలనుకున్నట్లు చెప్పిన నాయర్.. వెన్నెముక సమస్యల కారణంగా అంతా ఆగిపోయిందని గుర్తుచేసుకున్నాడు. తాను మైసూరులోని ఓ ఆయుర్వేద ఆస్పత్రిలో చికిత్స పొందానని.. యోగా సహాయంతో పూర్తిగా కోలుకున్నానని తెలిపాడు. ప్రస్తుతం ఔత్సాహికులకు యోగా నేర్పిస్తున్న నాయర్​.. పర్యావరణంపై అవగాహన పెంచడంతో పాటు మొక్కలు నాటాలని ప్రచారం చేస్తున్నాడు. పర్యావరణం సరిగా ఉంటేనే దేశం బాగుంటుందని నాయర్​ చెబుతున్నాడు.

'కరోనా సమయంలో నాకు ఈ పాదయాత్ర ఆలోచన వచ్చింది. పర్యటనలో ప్రతి రోజు సామాన్యులతో మాట్లడతాను. యోగా చేయమని చెబుతాను. దేశప్రజలకు నేను చేసే విన్నపం ఇదే. ప్రతిరోజూ యోగా సాధన చేయడం, ఆరోగ్యంగా ఉండటానికి చెట్లను నాటడం... ఈ రెండు విషయాలు మానవ జీవితానికి ముఖ్యమైనవి. దయచేసి నా ప్రచారాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను" అని నాయర్ చెప్పుకొచ్చాడు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.