కాబుల్ విమానాశ్రయంలోని(Kabul airport) ప్రస్తుత పరిస్థితులపై వస్తున్న దృశ్యాలు... 'కాందహార్ విమాన హైజాక్ ఘటన'ను తలపిస్తున్నాయని కెప్టెన్ దేవీ శరణ్ పేర్కొన్నారు. 1999 డిసెంబరు 24న కాఠ్మాండూ నుంచి 179 మంది ప్రయాణికులు, 11 మంది సిబ్బందితో బయల్దేరిన ఇండియన్ ఎయిర్ లైన్స్ (ఐసీ814) విమానాన్ని పాకిస్థాన్ ఉగ్రవాదులు హైజాక్ చేసి... తాలిబన్ల ఆధిపత్యంలోని కాందహార్‌కు(Kabul news) తరలించారు. అప్పుడు ఆ విమాన కెప్టెన్‌గా శరణ్ విధులు నిర్వర్తించారు. అఫ్గాన్‌లోని తాజా పరిస్థితుల(Afghanistan crisis) నేపథ్యంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
"రెండు దశాబ్దాలు గడిచినా, నేటికీ అవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. కాందహార్ నుంచి ఎలా బయటపడాలని మనం ఎదురుచూశామో... కాబుల్ విమానాశ్రయంలో(kabul afghanistan) ఇప్పుడు వేలమంది అదే ఆత్రుతతో ఉన్నారు. కాకపోతే అప్పుడు మనం మాత్రమే బాధితులం. ఇప్పుడు చాలా దేశాలవారు ఉన్నారు."
-కెప్టెన్ దేవీ శరణ్, ఐసీ814 పైలట్
"తాలిబన్లలో(taliban) రెండు రకాలవారు ఉంటారు. ఆయుధాలు పట్టుకునే వారు కబాలీలు. మరోరకం వారు కమెండోలు. కబాలీలు హైజాకర్లకు అనుకూలంగా వ్యవహరిస్తారు. వారి డిమాండ్లను అంగీకరించేంత వరకూ విడిచిపెట్టరు" అని శరణ్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి: ఆ సమయంలో భారతీయులపై తాలిబన్ల కాల్పులు!
ఇదీ చూడండి: అఫ్గాన్ లో సిటీ బస్సులు- విమానాలు ఒకటే!