ETV Bharat / bharat

విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్​లో ఐఐఎస్​సీ సత్తా- దేశంలో టాప్​! - భారతీయ విజ్ఞాన సంస్థకు టాప్​ ర్యాంక్​

ద టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఏటా ప్రకటించే ప్రపంచ విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్​లో(University Ranking in India) బెంగళూరుకు చెందిన ఇండియన్​ ఇనిస్టిట్యూట్ ఆఫ్​ సైన్స్(IISC)​ మరోమారు సత్తా చాటింది. ప్రపంచ ర్యాంకింగ్స్​లో 301- 350 మధ్యన చోటు దక్కించుకుంది.

IISc
ఐఐఎస్​సీ
author img

By

Published : Sep 3, 2021, 7:20 AM IST

ద టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఏటా ప్రకటించే ప్రపంచ విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్​‌లో(University Ranking in India) బెంగళూరుకు చెందిన భారతీయ విజ్ఞాన సంస్థ (ఐఐఎస్‌సీ)(IISC) మరోసారి సత్తా చాటింది. ప్రపంచ ర్యాంకింగ్‌ జాబితాలో 301-350 మధ్య చోటు దక్కించుకోగా, భారతీయ వర్సిటీల్లో తొలి స్థానంలో నిలిచింది. వరుసగా మూడేళ్లుగా ఈ జాబితాలో దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోంది.

గురువారం ప్రకటించిన జాబితాలో ఆరు భారతీయ విశ్వవిద్యాలయాలు 600లోపు ప్రపంచ ర్యాంకులు సాధించాయి. వీటిలో ఐఐటీ రాయ్‌పూర్‌, జేఎస్‌ఎస్‌ అకడమిక్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (351-400), ఐఐటీ ఇందోర్‌ (401-500), అలగప్ప, థాపర్‌ విశ్వవిద్యాలయాలు (501-600) మెరుగైన ర్యాంకులు సాధించాయి. మరో 10 విశ్వవిద్యాలయాలు 8001-1000 ర్యాంకుల మధ్య చోటు దక్కించుకోగా వీటిలో బనారస్‌ హిందూ, జేఎన్‌యూ, దిల్లీ టెక్నాలజీ తదితర విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఈ ర్యాంకుల్లో ఆక్స్‌ఫర్డ్‌, కాలిఫోర్నియా ఐటీ, హార్వర్డ్‌ విశ్వవిద్యాలయాలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.

ఇదీ చూడండి: విదేశీయుల వీసా గడువు పెంపు.. ఎప్పటివరకంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.