ETV Bharat / bharat

Third wave: భారత్​లో మూడోదశ ముప్పు తక్కువే! ​ - డెల్టా ప్లస్ వేరియంట్

భారత్​తో సహా విదేశాల్లోనూ డెల్టా ప్లస్​(Delta plus variant) ప్రభావం అంతగాలేదని ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ జెనోమిక్స్​ అండ్​ ఇంటిగ్రేటివ్​ బయాలజీ (ఐజీఐబీ) వెల్లడించింది. డెల్టాప్లస్​ వేరియంట్​ వ్యాప్తిపై ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో ఈ అంశం కాస్త ఊరట కలిగిస్తోంది.

IGIB diminishes fears over Delta plus variant of Covid-19
భారత్​లో మూడోదశ ముప్పు తక్కువే! ​
author img

By

Published : Jul 7, 2021, 2:51 PM IST

కరోనా వైరస్​ డెల్టా ప్లస్​​ వేరియంట్​ వ్యాప్తిపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో.. ఊరట కలిగించే విషయం చెప్పింది ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ జీనోమిక్స్​ అండ్​ ఇంటిగ్రేటివ్​ బయాలజీ (ఐజీఐబీ). భారత్​ సహా విదేశాల్లోనూ డెల్టా ప్లస్​(Delta plus variant) ప్రభావం తక్కువగానే ఉందని పేర్కొంది.

"డెల్టాప్లస్​ గురించి ఆందోళన చెందనవసరం లేదు. అయితే అప్రమత్తత, నిశిత పర్యవేక్షణ అవసరం. విదేశాల్లో లేదా భారత్​లోనూ AY.1, AY.2 రకానికి చెందిన వైరస్​లు కనిపంచలేదు" అని సీఎస్​ఐఆర్​-ఐజీఐబీ డైరెక్టర్​ డాక్టర్​ అనురాగ్​ అగర్వాల్​.. ఈటీవీ భారత్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

అన్ని టీకాలకు సమర్థంగా

అన్ని వేరియంట్లను ఎదుర్కొగలిగే సామర్థ్యం కరోనా టీకాలకు ఉందని అనురాగ్​ పేర్కొన్నారు. "కొవిషీల్డ్ టీకా రెండు​ డోసులు డెల్టా వేరియంట్లపై ప్రభావవంతంగా పని చేస్తాయని ఇటీవల భారత వైద్యపరిశోధనా మండలి(ICMR) నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. అయితే డెల్టా ప్లస్​ వేరియంట్​ వేగంగా విస్తరిస్తోందన్న వదంతుల వల్లే మూడోదశ వస్తుందన్న ఆందోళన నెలకొంది" అని వ్యాఖ్యానించారు.

"రెండు డోసులు తీసుకుంటే ఏ వ్యాక్సిన్ అయినా సమర్థంగా పని చేస్తుంది. భవిష్యత్​లో ఇన్​ఫెక్షన్స్​ నుంచి రక్షణ కల్పిస్తాయి. ఇది కూడా వ్యక్తుల్లోని యాంటీబాడీ ఉత్పత్తి, కొవిడ్​ ప్రవర్తనకు అనుగుణంగా ఉంటుంది" అని ఏసియన్​ సొసైటీ ఎమర్జెన్సీ మెడిసిన్​ అధ్యక్షుడు డాక్టర్​ తమోరిశ్​ కోలే పేర్కొన్నారు.

ఫైజర్.. సూపర్

భారత్​లో డెల్టా ప్లస్​ వేరియంట్​.. ఆందోళనకరంగా మారింది. కే417ఎన్​ మ్యూటేషన్ల వల్ల మోనోక్లోనల్​ యాంటీబాడీల స్పందనను తగ్గించడంతో పాటు.. వ్యాక్సినేషన్ అనంతరం వాటి నుంచి తప్పించుకునే అవకాశం ఉండటమే ఇందుకు కారణమని కోలే తెలిపారు. "అయితే ఫైజర్​ టీకా సింగిల్​ డోసు తీసుకుంటే 33 శాతం, రెండు డోసులు తీసుకుంటే 88 శాతం సామర్థ్యంతో డెల్టా వేరియంట్​పై పని చేస్తుందని కోలే పేర్కొన్నారు. భారత్​ కూడా డెల్టా ప్లస్​ వేరియంట్​పై టీకాలు ఎంత మేర ప్రభావం చూపుతాయని పరిశోధనలు చేస్తోందని, త్వరలోనే ఫలితాలు వస్తాయని చెప్పారు.

మూడో దశ ఇలా...

కరోనా మూడో దశను ఉద్దేశించి మాట్లాడిన కోలే.. 'మూడోదశ వ్యాప్తి ఉంటుంది. కానీ రెండో దశ అంత తీవ్రత ఉండకపోవచ్చు. వ్యాక్సినేషన్​ రేటు మూడోదశ తీవ్రతను నిర్ణయిస్తుంది. భారత్​లో ఇప్పటి వరకు డెల్టా ప్లస్ అంత ప్రభావం చూపలేదు. అయితే మూడో దశలో దాని ప్రభావాన్ని చూపుతుందా లేదా అని చెప్పడం కష్టం' అని పేర్కొన్నారు.

దేశంలో ఇప్పటివరకు 12 రాష్ట్రాల్లో 48 డెల్టా ప్లస్ వేరియంట్​ కేసులు నమోదయ్యాయి. . ఏప్రిల్, మే, జూన్ నెలల్లో సేకరించిన 45,000 శాంపిల్స్‌కు పైగా జన్యు శ్రేణిని అనుసరించి డెల్టా ప్లస్ వేరియంట్లను గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: Vaccination: కరోనా టీకా​ తీసుకున్నవారికే రేషన్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.