రానున్న ఎన్నికల్లో.. తృణమూల్ కాంగ్రెస్ గెలిస్తే బంగాల్ మరో కశ్మీర్‌లా తయారవుతుందని భాజపా నేత సువేందు అధికారి ఆరోపించారు. ఎన్నికల నేపథ్యంలో బెహాలాలో నిర్వహించిన పార్టీ కార్యక్రమానికి హాజరైన ఆయన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు.
"శ్యామా ప్రకాశ్ ముఖర్జీ లేకపోయుంటే భారత్ ఇస్లామిక్ దేశంలా మారిపోయేది. మనం బంగ్లాదేశ్‌లో నివసిస్తుండేవాళ్లం. తృణమూల్ కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తే బంగాల్ మరో కశ్మీర్‌లా తయారవుతుంది."
-సువేందు అధికారి, భాజపా నేత.
నందిగ్రామ్‌లో మమతకు పోటీగా బరిలోకి దిగుతానని సువేందు అధికారి ఇప్పటికే ప్రకటించారు. దీదీపై 50,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తానని సవాల్ విసిరారు.
బంగాల్లో ఎనిమిది దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 27న తొలి దశ పోలింగ్ నిర్వహించనున్నారు. మే 2న ఫలితాలు వెలువడనున్నాయి.
ఇదీ చదవండి:దీదీపై 50వేల ఓట్ల తేడాతో గెలుస్తా: సువేందు