ETV Bharat / bharat

ఎమ్మెల్సీ రేసులో దేవెగౌడ మనవడు.. గెలిస్తే ఫ్యామిలీ అరుదైన ఘనత - jds news latest

జేడీఎస్​ వ్యవస్థాపకుడు హెచ్​డీ దేవెగౌడ కుటుంబం రాజకీయాల్లో అరుదైన ఘనత సాధించనుంది. ఆయన మనవడు సూరజ్ రేవన్న.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిస్తే ఏకకాలంలో రాజ్యసభ, లోక్​సభ, శాసనసభ, శాసనమండలికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక కుటుంబంగా అవతరించనుంది(hd deve gowda grandson).

If the grandson of former PM HD Deve Gowda wins the MLC election
ఎమ్మెల్సీ రేసులో దేవెగౌడ మనవడు.. గెలిస్తే ఫ్యామిలీ అరుదైన ఘనత
author img

By

Published : Nov 25, 2021, 11:16 AM IST

మాజీ ప్రధాని, జేడీఎస్​ వ్యవస్థాపకుడు హెచ్​​డీ దేవెగౌడ మనవడు సూరజ్​ రేవన్న.. కర్ణాటక శాసనమండలి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. దేవెగౌడ కుటుంబం నుంచి రాజకీయరంగంలో ప్రవేశిస్తున్న 8వ వ్యక్తిగా నిలిచిచాడు. ఒకవేళ ఈ ఎన్నికల్లో సూరజ్ గెలిస్తే వీరి కుటుంబం అరుదైన ఘనత సాధించనుంది. ఏకకాలంలో లోక్​సభ, రాజ్యసభ, శాసనసభ, శాసనమండలి ప్రతినిధులుగా సేవలందిస్తున్న ఫ్యామిలీగా అవతరించనుంది(hd deve gowda grandson).

హెజ్​డీ దేవెగడ పెద్దకుమారుడు హెడీ రేవన్న వారుసుడే సూరజ్ రేవన్న(deve gowda grandson political entry ). వృత్తిరిత్యా డాక్టర్. జేడీఎస్​కు కంచుకోట అయిన హాసన్ నుంచి ఎంఎల్​సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈయన ​ తండ్రి హెచ్​డీ రేవన్న కర్ణాటక మాజీ మంత్రి. ప్రస్తుతం హొలెనర్సిపుర నుంచి ఎమ్మేల్యేగా ఉన్నారు. సూరజ్ తల్లి భవాని జిల్లా పరిషత్ సభ్యురాలిగా ఉన్నారు. సూరజ్ సోదరుడు ప్రజ్వల్​.. హాసన్​ లోక్​సభ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు.

ఇక జేడీఎస్ అధినేత హెచ్​డీ దేవెగౌడ రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. ఆయన చిన్న కుమారుడు హెచ్​డీ కుమారస్వామి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి. చెన్నపట్నం ఎమ్మెల్యే. కుమారస్వామి సతీమణి అనిత కూడా రామనగర ఎమ్మెల్యేగా సేవలందిస్తున్నారు. వీరి కుమారుడు నిఖిల్​ జేడీఎస్ యూత్ వింగ్ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. 2019 లోక్​సభ ఎన్నికల్లో మండ్య నియోజకవర్గం నుంచి పోటీ చేసి సుమలత అంబరీష్ చేతిలో ఓడిపోయారు(karnataka hd deve gowda grandson ).

ఇప్పుడు ఎమెల్సీగా పోటీ చేస్తున్న సూరజ్ గెలిస్తే హెచ్​డీ దేవెగౌడ కుటుంబం నుంచి పార్లమెంటు, అసెంబ్లీకి ఆరుగురు ప్రాతినిధ్యం వహించినట్లవుతుంది. ఫలితంగా అరుదైన రికార్డు సాధించవచ్చు.

గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాలుగు స్థానాలు కైవసం చేసుకున్నామని, ఈ సారి ఆ సంఖ్య పెరుగుతుందని హెచ్​డీ కుమారస్వామి విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీ నాయకులతో చర్చించిన తర్వాతే ఏడు స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలో నిలపాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు(karnataka mlc election).

కర్ణాటకలో స్థానిక సంస్థల కోటా ఎమెల్సీ ఎన్నికలు డిసెంబర్​ 10న జరగనున్నాయి. మొత్తం 25 స్థానాలకు గాను జేడీఎస్ 7 చోట్ల పోటీ చేస్తోంది. ప్రస్తుత ఎమ్మెల్సీల పదవీకాలం 2022 జనవరి 5న ముగుస్తున్నందున ఈ ఎన్నికలు అనివార్యమయ్యాయి. నామినేషన్ల గడువు నవంబర్​ 25న ముగిసింది. వీటి ఉపసంహరణ గడువు నవంబర్​ 26తో పూర్తవుతుంది. డిసెంబర్ 14 ఓట్ల కౌంటింగ్​తో పాటు ఫలితాలు వెల్లడిస్తారు(karnataka mlc election 2021).

కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, భాజపా కూడా ఎక్కువ స్థానాలు కైవసం చేసుకోవాలని భావిస్తున్నాయి. ఇప్పటికే సరైన అభ్యర్థులను ఎంపిక చేసి బరిలోకి దింపాయి. ప్రచారం కూడా ముమ్మరం చేశాయి(karnataka political news ).

ఇవీ చదవండి: ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 'కేజీఎఫ్​'.. వందల కోట్లకు అధిపతి!

Meghalaya congress: కాంగ్రెస్‌కు షాక్​- టీఎంసీలోకి 12 మంది ఎమ్మెల్యేలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.