ETV Bharat / bharat

డిగ్రీతో బ్యాంక్ అసిస్టెంట్‌ మేనేజర్​ ఉద్యోగం.. జీతం, దరఖాస్తు వివరాలు ఇలా...

ఇండస్ట్రియల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఐడీబీఐ) అసిస్టెంట్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా రెండు కేటగిరీల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి ఉన్న వారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి? పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

IDBI
ఐడీబీఐ
author img

By

Published : Jun 6, 2022, 7:15 PM IST

ఇండస్ట్రియల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఐడీబీఐ) అసిస్టెంట్‌ మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా.. 1044 ఎగ్జిక్యూటివ్‌, 500 అసిస్టెంట్‌ మేనేజర్​ పోస్టులు భర్తీ చేయనున్నారు.

గుర్తుంచుకోవాల్సిన తేదీలు:

  • దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జూన్‌ 03, 2022
  • దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 17, 2022
  • ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు రాత పరీక్ష తేదీ: జులై 9, 2022
  • అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులకు రాత పరీక్ష తేదీ: జులై 23, 2022

అర్హతలు:

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేయాలి
  • డిగ్రీలో కనీసం 55శాతం మార్కులు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ కోటా వారికి 50శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.

వయస్సు:

  • ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 1-04-2022 నాటికి 20 ఏళ్లు నిండిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. గరిష్ఠ వయో పరిమితి 25 ఏళ్లు.
  • అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 21 నుంచి 28 ఏళ్ల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక:

  • ఆన్‌లైన్ పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను రెండు పోస్టులకు ఎంపిక చేస్తారు.
  • అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది.
  • ఇతర వివరాలను నోటిఫికేషన్‌ ఫామ్​తో పాటు ఐడీబీఐ సైట్​లో చూసుకోవచ్చు.

ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ ప్రక్రియ కాంట్రాక్ట్ పద్ధతిలో ఉంటుంది. ఏడాది తర్వాత పనితీరు ఆధారంగా కాలాన్ని పెంచుతారు. ఆ విధంగా మూడేళ్లు పూర్తి చేసిన వారు.. అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ పోస్టుకు అర్హులవుతారు.

వేతనం:

  • మొదటి ఏడాది- రూ. 29000
  • రెండో ఏడాది- రూ. 31000
  • మూడో ఏడాది- రూ. 34000.

ఐడీబీఐ రిక్రూటమెంట్​ ప్రక్రియ పూర్తి వివరాల కోసం https://www.idbibank.in/ వెబ్​సైట్​ను సందర్శించండి.

ఇదీ చదవండి: 'పది అర్హత'తో 39 వేల పోస్టులు.. అప్లై చేశారా? ఈరోజే లాస్ట్ డేట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.