ETV Bharat / bharat

హాసిమారాలో 'రఫేల్' రెండో స్క్వాడ్రన్ - రఫేల్ స్థావరాలు

బంగాల్​లోని హాసిమారా వైమానిక స్థావరంలో రఫేల్​ యుద్ధ విమానాల రెండో స్క్వాడ్రన్​ను ఏర్పాటు చేసేందుకు వైమానిక దళం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటివరకు 11 రఫేల్​లు భారత్​ చేరుకోగా కొద్ది నెలల్లో మరిన్ని వచ్చే అవకాశం ఉంది.

RAFALE
హాసిమారాలో 'రఫేల్' రెండో స్క్వాడ్రన్
author img

By

Published : Mar 12, 2021, 5:57 AM IST

రఫేల్ యుద్ధ విమానాల రెండో స్క్వాడ్రన్​ను బంగాల్​లోని హాసిమారా వైమానిక స్థావరంలో వచ్చే నెల మధ్యలో ఏర్పాటు చేసేందుకు భారత వైమానిక దళం రంగం సిద్ధం చేస్తున్నట్లు అధికార వర్గాలు గురువారం తెలిపాయి. తొలి స్క్వాడ్రన్ రఫేల్ యుద్ధ విమానాలను అంబాలా వైమానికదళ స్టేషన్​లో ఉంచారు.

ఫ్రాన్స్ నుంచి మొత్తం 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఒప్పందం కుదిరింది. వీటిలో తొలి బ్యాచ్​గా గతేడాది జులై 29న 5 యుద్ధ విమానాలు భారత్​కు వచ్చాయి. సెప్టెంబరు 10న అంబాలాలో వీటిని చేర్చారు. అనంతరం వరుసగా నవంబరు 3న, జనవరి 21న రెండు, మూడు బ్యాచుల్లో 3 చొప్పున యుద్ధ విమానాలు భారత్​కు వచ్చాయి. కొద్ది నెలల్లో మరిన్ని రఫేల్ యుద్ధవిమానాలు వచ్చే అవకాశం ఉంది. ఒక స్క్వాడ్రన్​లో దాదాపు 18 యుద్ధ విమానాలుంటాయి.

ఇదీ చదవండి : పిల్లల బొమ్మలతో 'రఫేల్'​ జెట్స్​కు ముప్పు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.