ETV Bharat / bharat

సరిహద్దు సమస్యలపై వాయుసేన కమాండర్ల చర్చ - వాయుసేన కమాండర్ల చర్చ

దేశం ఎదుర్కొంటున్న భద్రతా సమస్యలపై వాయుసేన కమాండర్లు నిర్వహించే సమీక్షా సమావేశాలు ప్రారంభమయ్యాయి. వివిధ అంశాలపై మూడు రోజుల పాటు విస్తృతంగా చర్చలు జరగనున్నాయి. తొలిరోజు సమావేశాల్లో భాగంగా.. తూర్పు లద్దాఖ్​లో సరిహద్దు సమస్యల గురించి చర్చించారు అధికారులు.

IAF commanders conference
సరిహద్దు సమస్యలపై వాయుసేన కమాండర్ల చర్చ
author img

By

Published : Apr 15, 2021, 5:58 PM IST

భారత్ ఎదుర్కొంటున్న భద్రతా సమస్యలపై వాయుసేన కమాండర్లు నిర్వహించే సమీక్షా సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ ద్వైవార్షిక కమాండర్ల సమావేశాలను.. రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్.. దిల్లీలోని వాయుసేన హెడ్​క్వార్టర్స్(వాయు భవన్)లో ప్రారంభించారు.

భారత వాయుసేనకు చెందిన ఉన్నతస్థాయి కమాండర్లు ఈ సమావేశాల్లో పాల్గొని వివిధ అంశాలపై చర్చలు జరపనున్నారు. ఇందులో భాగంగా గురువారం.. వాస్తవాధీన రేఖ వెంబడి భారత్​కు ఉన్న సమస్యల గురించి చర్చించారు. తూర్పు లద్దాఖ్​లోని పరిస్థితులు, చైనా ఆర్మీతో ఉన్న సమస్యలపై సమాలోచనలు జరిపారు.

భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యల దృష్ట్యా.. వాయుసేన బలోపేతం కోసం రూపొందించేవ్యూహాలపై అధికారులు చర్చించనున్నారు. పరిపాలనా సామర్థ్యాన్ని మెరుగుపర్చేలా తీసుకోవాల్సిన వివిధ సంక్షేమ చర్యల గురించి ప్రస్తావించనున్నారు.

కమాండర్ల సమావేశం సందర్భంగా.. భారత వాయుసేన యుద్ధ సన్నద్ధతను రాజ్​నాథ్ సింగ్ ప్రశంసించారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. భవిష్యత్తులో తలెత్తే సమస్యలను ముందుగానే సమీక్షించడం మంచి విషయమని పేర్కొన్నట్లు వెల్లడించాయి.

ఇదీ చదవండి:'కరోనా​ను ప్రకృతి విపత్తుగా ప్రకటించండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.