దిల్లీకి చెందిన ఓ ఐదేళ్ల బాలుడు బాక్సింగ్‌లో ప్రపంచ రికార్డు సృష్టించాడు. కేవలం 13 సెకన్లలో 100 పంచ్‌లు విసిరి ప్రఖ్యాత గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు. పుట్టిన రోజు బహుమతిగా తండ్రి ఇచ్చిన పంచ్ బ్యాగ్‌పై ప్రాక్టీస్ చేసిన అరిందమ్ గౌర్.. తక్కువ సమయంలో ఎక్కువ బాక్సింగ్ పంచ్‌లు కురిపించిన చిన్నారిగా రికార్డు నెలకొల్పాడు.
"నాకు బాక్సింగ్ అంటే చాలా ఇష్టం. రోజూ ఉదయం, సాయంత్రం 3 గంటల పాటు శిక్షణ తీసుకుంటున్నా. భారత్ తరఫున మంచి బాక్సర్‌గా మారి.. ప్రపంచ రికార్డు నెలకొల్పుతా. నా అభిమాన బాక్సర్లు విజేందర్ సింగ్, మేరీ కోమ్."
-అరిందం గౌర్
భవిష్యత్తులో భారత్ తరఫున బాక్సింగ్ క్రీడలో ప్రాతినిధ్యం వహించడమే తన లక్ష్యంగా పేర్కొన్నాడు ఈ చిచ్చర పిడుగు. టోక్యో ఒలింపిక్స్‌కు బయలుదేరి వెళ్లిన భారత స్టార్ బాక్సర్ మేరీ కోమ్‌కు శుభాకాంక్షలు తెలిపాడు.
"అరిందం ఐదో పుట్టినరోజున ఒక పంచ్ బ్యాగ్ గిఫ్ట్‌గా ఇచ్చాను. వాస్తవానికి దానిని తీసుకురావాలని చాలాసార్లు అడిగాడు. ఈ బ్యాగ్ గురించి ఎక్కడ విన్నాడో తెలియదు. ఇచ్చిన తరువాత తనంతట తానే ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాడు"
-అరుణ్ గౌర్, అరిందం తండ్రి
ఐదు సంవత్సరాల 5 నెలల వయస్సులోనే 13.7 సెకన్లలో వంద బాక్సింగ్ పంచ్‌లు ఇచ్చి రికార్డు నెలకొల్పిన ఈ చిన్నారి ప్రస్తుతం ఒకటో తరగతి చదువుతున్నాడు.
ఇవీ చదవండి: