ETV Bharat / bharat

Hyderabad Man Killed in London : లండన్‌లో హైదరాబాద్ వాసి హత్య.. కూతురు పెళ్లి కోసం భారత్​కు వద్దామనుకునేలోగా దారుణం

Hyderabad Man Killed in London
Hyderabad Man
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 3, 2023, 11:24 AM IST

Updated : Oct 3, 2023, 1:00 PM IST

11:21 October 03

Hyderabad Man Killed in London : లండన్‌లో హైదరాబాద్ వాసి హత్య.. ఆపై

Hyderabad Man Killed in London : లండన్‌లో హైదరాబాద్​కు చెందిన రైసుద్దీన్​ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఉపాధి కోసం లండన్ వెళ్లిన రైసుద్దీన్‌ను దుండగులు హత్య చేశారు. మిత్రుడితో కలిసి బయటకు వెళ్తుండగా అడ్డుకున్న దుండగులు హత్య చేసినట్లు సమాచారం. హత్యచేసిన అనంతరం ఆయన వద్ద ఉన్న నగదుతో పాటు వస్తువులు దోచుకొని వెళ్లారు.

Hyderabad Man Killed in UK : కుమార్తె పెళ్లి కొరకు హైదరాబాద్​కు వద్దామనుకుంటున్న సమయంలో హత్య జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు కుటుంబసభ్యులు కుమార్తె పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. ఈ సమయంలో ఆయన హత్యకు గురవ్వడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు రైసుద్దీన్ మృతదేహాన్ని హైదరాబాద్​కు రప్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Hyderabad Man Stabbed To Death in London : సమాచారం తెలుసుకున్న స్థానిక నేత అంజదుల్లా ఖాన్‌ రైసుద్దీన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి కుటుంబానికి సానుభూతి ప్రకటిస్తూ.. అండగా ఉంటామని భరోసా కల్పించారు. రైసుద్దీన్ మృతదేహాన్ని వెంటనే హైదరాబాద్​కు తరలించేలా చూడాలని ఆయన కుటుంబ సభ్యులను అంజదుల్లా ఖాన్​ను కోరారు. ఆయన వెంటనే.. రైసుద్దీన్ విషయాన్ని వివరిస్తూ.. అతడి మృతదేవాన్ని హైదరాబాద్​కు తరలించాలని లండన్‌లో ఉన్న ఇండియన్‌ హై కమిషన్‌ ప్రతినిధులకు ఆదేశాలు జారీ చేయాలని విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్‌కు మెయిల్‌ పంపారు.

"ఉపాధి కోసం లండన్ వచ్చిన హైదరాబాద్ వాసి మహమ్మద్‌ ఖాజా రైసుద్దీన్​ను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. రైసుద్దీన్​తో పాటు ఆఫ్ఘాన్‌ దేశస్థుడుతో కలిసి వెళ్తుండగా వారిద్దరిపై దాడిచేసి హతమార్చారు. శనివారం రాత్రి ఇద్దరు వ్యక్తులు కత్తితో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. రైసుద్దీన్ ఘటన స్థలంలోనే మృతి చెందాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతడికి చికిత్స జరుగుతోంది. అతడి పరిస్థితి కూడా విషమంగా ఉంది. వారి వద్ద ఉన్న డబ్బు కోసమే ఈ దాడి చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించాం. మిగతా విషయాలు పూర్తిగా దర్యాప్తు చేసిన తర్వాత వెల్లడిస్తాం. ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాం." అని లండన్ అధికారులు తెలిపారు.

Hyderabad Man Kills Daughter : భవిష్యత్​లో కష్టాలొస్తాయని.. కూతుర్ని చంపేశాడు

Last Updated : Oct 3, 2023, 1:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.