ETV Bharat / bharat

చీర సరిగా కట్టుకోవడం లేదని ఉరేసుకున్న భర్త.. మధ్యప్రదేశ్​లో కిరాతక హత్యలు

crime news: ఆరు నెలల క్రితం వివాహం చేసుకున్న ఓ వ్యక్తి.. భార్యపై విసుగుచెంది ఆత్మహత్య చేసుకున్నాడు. తన భార్య సరిగా చీర కట్టుకోవడం లేదని పేర్కొంటూ ఉరేసుకున్నాడు. మరోవైపు, మధ్యప్రదేశ్​లో ఓ వృద్ధ జంటను, వారి మనవరాలిని దారుణంగా హత్య చేశారు దుండగులు. వీటితో పాటు పలు రాష్ట్రాల్లో జరిగిన నేరాల వివరాలు ఇలా ఉన్నాయి..

crime news
crime news
author img

By

Published : May 17, 2022, 5:41 PM IST

crime news: భార్య సరిగా చీరకట్టుకోవడం లేదని మహారాష్ట్ర ఔరంగాబాద్​లో ఓ యువకుడు (24) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ముకుంద్​నగర్​కు చెందిన సమాధాన్ సాబ్లె అనే వ్యక్తి సోమవారం ఇంట్లో ఉరేసుకున్నాడని మకుందువాడీ పోలీసులు తెలిపారు.
అతడి గదిలో సూసైడ్ నోట్ కనిపించిందని చెప్పారు. భార్య సరిగా చీర కట్టుకోవడం లేదని, సరిగా నడవడం, మాట్లాడటం గానీ చేయడం లేదని సూసైడ్ నోట్​లో రాశాడని తెలిపారు. ఆరు నెలల క్రితమే అతడికి వివాహం జరిగిందని పోలీసులు తెలిపారు. తన కన్నా ఆరేళ్లు ఎక్కువ వయసు ఉన్న మహిళను పెళ్లి చేసుకున్నాడని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

తల నరికి.. కి.మీ దూరంలోని చెట్టుకు..
Madhya Pradesh Killings: మధ్యప్రదేశ్​లో కిరాతక హత్యలు జరిగాయి. గుర్తు తెలియని వ్యక్తులు వృద్ధ దంపతులను దారుణంగా హత్య చేశారు. వారి మనవరాలిని సైతం చంపేశారు. వృద్ధ మహిళ తలను మొండెం నుంచి వేరు చేసి.. దగ్గర్లోని చెట్టుకు వేలాడదీశారు. మండ్లా జిల్లాలోని పతాదీ గ్రామంలో ఈ ఘటన జరిగింది.

పోలీసుల కథనం ప్రకారం 62ఏళ్ల వ్యక్తి.. తన భార్యతో (57) కలిసి స్థానికంగా నివాసం ఉంటున్నారు. 12ఏళ్ల మనవరాలు సైతం ఇటీవల వారి ఇంటికి వచ్చింది. మంగళవారం ఉదయం వీరు విగతజీవులుగా పడి ఉండటం స్థానికులు చూశారు. సోమవారం అర్థరాత్రి తర్వాత వీరిని హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇంటి దాబాపై నిద్రిస్తుండగా వీరందరినీ గొంతు కోసి చంపినట్లు తెలుస్తోంది. మహిళ తలను నరికి.. కిలోమీటర్ దూరంలో ఉన్న ఓ పొలంలోని చెట్టుకు వేలాడదీశారు. సమాచారం అందుకున్న పోలీసులు మంగళవారం ఉదయం ఘటనాస్థలికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులను సంప్రదించి మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.

బాలికపై బావ అత్యాచారం..:
UP Balarampur rape: ఉత్తర్​ప్రదేశ్​లోని బలరాంపుర్​లో ఏడేళ్ల బాలికపై వరుసకు బావ అయ్యే వ్యక్తి అత్యాచారం చేశాడు. ఆదివారం తన అత్తవారింటికి వచ్చిన నిందితుడు.. ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. బాలిక తన అక్కను పిలిచేందుకు నిందితుడి గదికి వెళ్లగా.. ఇదే సమయంలో అత్యాచారానికి తెగబడ్డాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాలిక ఆరోగ్య పరిస్థితి క్షీణించినందున.. ఆస్పత్రికి తరలించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

వారణాసిలో మరో బాలికపై..
Varanasi girl raped: మరోవైపు, వారణాసిలోని భేల్​పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగేళ్ల బాలికపై పొరుగింటి యువకుడు అత్యాచారం చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. బాలిక అరుపులు విన్న కుటుంబ సభ్యులు.. పక్కింట్లోకి వెళ్లగా అత్యాచారం జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పోలీసుల వివరాల ప్రకారం.. అత్యాచారానికి గురైన బాలిక.. ఇటీవల తన అమ్మమ్మ ఇంటికి వచ్చింది. పొరుగింట్లో ఉండే సోనూ అనే వ్యక్తి.. బాలిక ఉండే ఇంటికి తరచూ వస్తుండేవాడు. వచ్చినప్పుడల్లా చిన్నారికి తినుబండారాలు ఇచ్చేవాడు. దీంతో బాలిక అతడితో సన్నిహితంగా ఉండేది. ఈ క్రమంలోనే సోమవారం అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బాలికకు వైద్య పరీక్షలు పూర్తి చేసినట్లు చెప్పారు.

అడవిలో మహిళపై..
గిరిజన ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి దివ్యాంగ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఝార్ఖండ్​లోని తూర్పు సింఘ్​భుమ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. వంటచెరకు కోసం కందిదుమ్రి అడవిలోకి మహిళ వెళ్లగా.. గమనించిన నిందితుడు ఆమెను బలవంతం చేశాడు. నోరు నొక్కేసి అత్యాచారం చేశాడు. మే 13న ఈ ఘటన జరిగింది. నిందితుడికి భయపడి మూడు రోజుల పాటు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు బాధితురాలు. భయంతో కుటుంబ సభ్యులకు సైతం విషయం చెప్పలేదు. చివరకు, ధైర్యం తెచ్చుకొని పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశారు.

ట్రైన్​ కింద పడి..
దొంగను వెంబడిస్తూ ఓ వ్యక్తి ట్రైన్ కింద పడి ఓ స్కూల్ టీచర్ (54) ప్రాణాలు కోల్పోయాడు. మధ్యప్రదేశ్​లోని షాదోల్ జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిందీ ఘటన.
మృతుడు మనోజ్ నీమా.. ఓ ప్రైవేట్ స్కూల్​లో పనిచేసేవాడు. సాగర్​కు వెళ్లేందుకు దుర్గ్-అజ్మీర్ రైలులో ప్రయాణిస్తున్న ఆయనను.. ఓ గుర్తు తెలియని వ్యక్తి సెల్​ఫోన్ అడిగాడు. అత్యవసర కాల్ చేసుకుంటానని చెప్పి.. ఫోన్ తీసుకున్నాడు. రైలు షాదోల్ స్టేషన్ రాగానే.. ఆ వ్యక్తి మనోజ్ ఫోన్​తో పారిపోయాడు. ఇది గమనించిన మనోజ్.. దొంగను వెంబడించాడు. ఈ క్రమంలోనే కాలు జారి.. రైల్వే ట్రాక్​పై పడిపోయాడు. ఇదే సమయంలో ఎదురుగా వచ్చిన రైలు అతడిని ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే మరణించాడు మనోజ్. అనంతరం, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అతడిని ఖేరీ గ్రామానికి చెందిన రాజేంద్ర సింగ్​గా గుర్తించారు. మొబైల్ ఫోన్​ను అతడి వద్ద నుంచి రికవరీ చేసుకున్నారు. తదుపరి విచారణ కొనసాగుతోంది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.