భార్యపై అనుమానంతో కిరాతకంగా ప్రవర్తించాడు ఓ వ్యక్తి. తనకు చెప్పకుండా బయటకు వెళ్లిందని.. భార్యను ఇష్టమొచ్చినట్లుగా చావబాదాడు. జననాంగాల్లోకి రాడ్‌ను చొప్పించి క్రూరంగా వ్యవహరించాడు. తీవ్రంగా గాయపడ్డ ఆ మహిళ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
పోలీసుల కథనం ప్రకారం...
మధ్యప్రదేశ్ ఇందోర్ జిల్లా మాన్పుర్కు చెందిన జ్ఞాన్‌సింగ్ ఓ దినసరి కూలి. అతనికి ఇద్దరు సంతానం. జ్ఞాన్‌సింగ్ రోజూ తాగొచ్చి భార్యను కొట్టేవాడు. దీంతో ఆమె భర్తకు చెప్పకుండా పుట్టింటికి వెళ్లింది. ఇంటికి తిరిగొచ్చిన అతని భార్యను ఎవరిని కలవడానికి వెళ్లావంటూ విచక్షణరహింతంగా కొట్టాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. 'బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. నిందితుడి కోసం వెతుకుతున్నాం' అని మాన్పుర్ పోలీసులు తెలిపారు.
ప్రాణం తీసిన యూట్యూబ్:
పొట్లకాయ రసం తాగి ఓ వ్యక్తి చనిపోయాడు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ఈ ఘటన జరిగింది. విజయ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధి స్వర్ణ్‌బాగ్ కాలనీలో చెందిన ధర్మేంద్ర.. చేతి నొప్పితో బాధ పడుతున్నాడు. నొప్పి నివారణ కోసం యూట్యూబ్‌లో చెప్పినట్లుగా పొట్లకాయ రసం తాగాడు. దాంతో అతనికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. పరిస్థితి మరింత తీవ్రం కావడంతో కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ధర్మేంద్ర చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ఎంవై ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. పోస్ట్‌మార్టం నివేదిక అనంతరం మరణానికి సంబంధించి స్పష్టమైన కారణం తెలుస్తుందన్నారు.
ఫేస్‌బుక్ లైవ్‌లో గొంతు కోసుకున్న యువకుడు:
ప్రేమంచిన అమ్మాయి పెళ్లి నిశ్చయమయిందన్న కారణంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. ఫేస్‌బుక్ లైవ్‌లోకి వచ్చి గ్రైండర్ మెషీన్‌తో గొంతు కోసుకున్నాడు. యూపీ మహరాజ్‌గంజ్‌లోని పురందర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్న శైలేశ్.. ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం అతడు పని కోసం హైదరాబాద్ వెళ్లాడు.
ఇంతలో ప్రేమించిన అమ్మాయికి వారి కుటుంబ సభ్యులు వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయించారు. విషయం తెలుకున్న శైలేశ్.. హైదరాబాద్ నుంచే ప్రేమించిన అమ్మాయితో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. వీలు కాకపోవడం వల్ల ఫేస్‌బుక్‌లో లైవ్‌కి వచ్చి గొంతు కోసుకున్నాడు. ఫేస్‌బుక్ ఘటనను చూసిన యువకుడి స్నేహితులు వెంటనే అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. ప్రస్తుతం యువకుడి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.