ETV Bharat / bharat

ఆన్​లైన్​ 'లోన్​ యాప్'​కు మరొకరు బలి - ఆత్మహాత్య

ఆన్​లైన్ లోన్​ యాప్​ వేధింపులు తట్టుకోలేక ఇటీవలి కాలంలో ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా తమిళనాడులో ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Humiliated by loan app financiers, Chengalpattu man kills self
ఆన్​లైన్​ 'లోన్​ యాప్'​ వేధింపులకు మరొకరు బలి.
author img

By

Published : Dec 22, 2020, 4:20 PM IST

ఆన్​లైన్ మనీ యాప్​ వేధింపులు భరించలేక మరో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన తమిళనాడులోని చెంగల్​పట్టు జిల్లా మధురకంఠన్​ సమీపంలో జరిగింది.

పళయనూరు గ్రామానికి చెందిన వివేక్​ అనే వ్యక్తి మామందూర్​లోని ఓ ప్రైవేట్​ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. తండ్రికి వైద్యం చేయించడానికి ఓ ఆన్​లైన్​ మనీ యాప్ ద్వారా రూ.4000 అప్పు తీసుకున్నాడు.

అయితే గడువులోగా అప్పు తీర్చలేకపోయాడు . దాంతో యాప్​ కస్టమర్​ కేర్​ వాళ్లు డబ్బులివ్వాలని పదేపదే ఫోన్​ చేశారు. బాధితుడి ఫోన్​లోని నంబర్​లన్నింటికీ కాల్​ చేసి ఇతను డబ్బుల్వివాలివ్వాలని చెప్పారు. తట్టుకోలేకపోయిన వివేక్ మానసికంగా కుంగిపోయాడు. సోమవారం ఇంటి దగ్గరలోని పాడు బడ్డ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇదీ చూడండి: 'ఈజీ లోన్​ యాప్స్​తో తస్మాత్ జాగ్రత్త'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.