బంగాల్ బీర్భూమ్ జిల్లాలో(West Bengal birbhum News) బుధవారం రాత్రి భారీ స్థాయిలో పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రామ్పుర్హత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మఝ్ఖండా గ్రామ సమీపంలో రహదారిపై నిలిపి ఉన్న ఓ వాహనంలో వీటిని పట్టుకున్నారు. అక్టోబరు 30న బంగాల్లో పలు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో(West Bengal By Election 2021) ఈ పేలుడు పదార్థాలు లభ్యమవ్వడం స్థానికంగా కలకలం సృష్టించింది.
వాహనంలో నుంచి 2,600 డిటోనేటర్లు, 5,500 జిలెటిన్ స్టిక్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వాహనాన్ని గుర్తించిన సమయంలో అందులో ఎవరూ లేరని చెప్పారు. సదరు వాహన యజమాని, డ్రైవర్‌ను గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టామని ఎస్పీ నాగేంద్ర త్రిపాఠి తెలిపారు.
ఇదీ చూడండి: బస్సులో నుంచి జారి పడి మహిళ మృతి