ETV Bharat / bharat

లోయలో పడ్డ బస్సు.. స్కూల్ పిల్లలు సహా 12 మంది మృతి.. ప్రధాని విచారం - himachal pradesh news

HP ACCIDENT
HP ACCIDENT
author img

By

Published : Jul 4, 2022, 10:01 AM IST

Updated : Jul 4, 2022, 3:11 PM IST

09:59 July 04

లోయలో పడ్డ బస్సు.. స్కూల్ పిల్లలు సహా 12 మంది మృతి.. ప్రధాని విచారం

ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు

Road Accident: హిమాచల్​ ప్రదేశ్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులు, స్కూల్ పిల్లలతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో పాఠశాల విద్యార్థులు సైతం ఉన్నారని జిల్లా అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం కులు జిల్లాలో సోమవారం ఉదయం 8.30 గంటలకు జరిగిందని పోలీసులు తెలిపారు.

అదే కారణం: సైంజ్​ ప్రాంతానికి వెళ్తున్న బస్సు.. జంగ్లా గ్రామ సమీపంలో ఉన్న లోయలో అదుపుతప్పి పడిపోయిందని కులు జిల్లా ఎస్పీ చెప్పారు. బస్సు అదుపుతప్పిన ప్రదేశంలో ముందురోజే కొండచరియలు విరిగిపడ్డాయని.. డ్రైవర్​ వాటిపై నుంచి బస్సును దాటించేందుకు ప్రయత్నించగా ఈ దుర్ఘటన జరిగినట్లు బంజర్​ ఎమ్మెల్యే సురేందర్​ శౌరీ వెల్లడించారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే.. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులను సమీపంలోని ఉన్న ఆసుపత్రికి తరలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. బస్సు సడన్​గా స్కిడ్​ అయిందని.. అప్రమత్తమయ్యేలోపే ప్రమాదం జరిగిపోయిందని బస్సు కండెక్టర్​ గోపాల్​ వెల్లడించారు. ఎవరినీ కాపాడేంత సమయం కూడా దొరకలేదని తెలిపారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన గోపాల్​ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఎక్స్​గ్రేషియా ప్రకటించిన మోదీ..
బస్సు లోయలో పడిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల ఆత్మకు శాంతికి చేకూరాలని కోరారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు ఎక్స్​గ్రేషియా ప్రకటించారు. మరోవైపు రాష్ట్రప్రభుత్వం కూడా బాధిత కుటుంబాలకు ఎక్స్​గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు తక్షణ సాయంగా రూ.15వేలు అందించనున్నట్లు ముఖ్యమంత్రి జయరామ్​ ఠాకుర్​ ప్రకటించారు. బాధితులకు కేంద్రం సాయం అందించడంపై ధన్యవాదాలు వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపడతామన్నారు ఠాకుర్​.

ఇవీ చదవండి: టీచర్ కర్కశం.. స్పృహ తప్పిపోయేలా విద్యార్థిని చితకబాది..

రాష్ట్రపతి పదవిని ఆనాడే వద్దనుకున్న రుక్మిణీ!

Last Updated : Jul 4, 2022, 3:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.