How To Stop Pressure Cooker Water Leakage : దాదాపుగా ప్రతీ ఇంట్లో కుక్కర్ విజిల్ వేస్తూనే ఉంటుంది. తొందరగా ఉడుకుతుంది కాబట్టి.. అవసరమైన వంటలకు కుక్కర్‌నే యూజ్ చేస్తుంటారు జనం. ఇంత వరకూ బాగానే ఉంటుందిగానీ.. కుక్కర్ మూత నుంచి వాటర్ లీక్ అయితే మాత్రం.. చాలా చిరాగ్గా ఉంటుంది. కుక్కర్ పైభాగంతోపాటు గ్యాస్ స్టౌ మొత్తం మరకలు పడతాయి. వీటిని క్లీన్ చేయడానికి.. మళ్లీ చాలా సమయం పడుతుంది. ఇవన్నీ చూడ్డానికి చిన్న సమస్యల్లా కనిపించినప్పటికీ.. వంట చేసే వారికి తెలుస్తుంది అసలు ఇబ్బంది.
కుక్కర్ నుంచి వాటర్ లీకేజీ కాకుండా ఉంటే బాగుండు అని కోరుకోని మహిళలే ఉండరు. ఈ సమస్యకు పరిష్కారాన్ని మేము తీసుకొచ్చాం. ఇవి పాటిస్తే.. కుక్కర్ లీకేజీ సమస్యను అరికట్టి.. హ్యాపీగా వంట చేసుకోవచ్చు. మరి, ఆ చిట్కాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కుక్కర్ వాటర్ లీకేజీని అడ్డుకోవడానికి చిట్కాలు..
- కుక్కర్‌లో ఏదైనా ఆహారాన్ని వండుతున్నప్పుడు మూత నుంచి నీరు లీక్ కాకుండా ఉండటానికి కుక్కర్‌లో ఒక చుక్క మంచి నూనె వేయండి. దీని వల్ల కుక్కర్ వాటర్ లీకేజీని అడ్డుకోవచ్చు.
- నూనె వేయడం వల్ల కుక్కర్‌లోని ఆహార పదార్థాలు.. పాత్రకు అంటుకోకుండా, విడివిడిగా మృదువుగా కూడా కుక్ అవుతాయి.
- కుక్కర్ లోపల ఉండే రబ్బర్ సరిగ్గా సెట్ చేయకపోవడం కూడా.. ఆవిరి లీక్ కావడానికి ప్రధాన కారణం కావొచ్చు.
- రబ్బరు సరిగ్గా ఫిట్ అవ్వకపోతే కచ్చితంగా వాటర్ లీక్ అవుతుంది. దీనివల్ల ఒక్కోసారి ఆహార పదార్థాలు కూడా సరిగ్గా ఉడకవు.
- రబ్బర్ చాలా పాతది అయితే కూడా.. నీరు లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు కొత్త కుక్కర్‌ను వాడుతున్నట్లయితే రబ్బరు ఎక్కువ కాలం రావాలంటే.. వంట చేసిన తరవాత ఆ రబ్బరును శుభ్రం చేసి డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టండి.
- కుక్కర్ మూతకు ఉన్న సేఫ్టీ ప్లగ్‌లు కూడా సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఒక్కోసారి వీటి వాచర్‌లు తేలికగా ఉంటే కూడా వాటర్ లీక్ అవుతుంది.
- కుక్కర్‌లో పదార్థాలను వండుతున్నప్పుడు ఒకేసారి మూతను బిగించకుండా.. ఒక పొంగు వచ్చిన తరవాత మూతను బిగిస్తే వాటర్ అనేది లీక్ కాకుండా ఉంటుంది.
- కుక్కర్ విజిల్‌ను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఆహార పదార్థాలను వండినప్పుడు కొన్ని పదార్థాలు ఈ విజిల్‌లో ఇరుక్కుపోతాయి. దీని వల్ల సరైన సమయంలో విజిల్ సౌండ్ రాదు. అలాగే పదార్థాలు కూడా ఎక్కువగా ఉడికిపోతాయి.
- కుక్కర్‌లో ఆహారం వండేటప్పుడు ఎప్పుడైనా గ్యాస్ స్టౌవ్‌ను.. మీడియమ్ ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి.
- హై ఫ్లెమ్‌లో స్టౌవ్‌ను పెట్టినప్పుడు.. ప్రెషర్ అంతా ఒకేసారి రిలీజ్ అవుతుంది. దీనివల్ల కూడా నీరు లీక్ అవుతుంది.
- మరో కీలకమైన విషయం.. కుక్కర్‌లో సరిపడా నీళ్లు మాత్రమే పోయాలి. ఎక్కువ నీళ్లను పోస్తే విజిల్ వచ్చే సమయంలో వాటర్ లీక్ అవుతుంది.
Viral Infection Remedies : ఇంటి చిట్కాలతో.. వైరల్ ఇన్ఫెక్షన్స్కు చెక్!
పండ్లు, కూరలు.. వేసవిలోనూ తాజాగా ఇలా!
TIPS: వర్షాకాలంలో దుస్తుల నుంచి దుర్వాసన రాకుండా ఏం చేయాలంటే..?