Natukodi Chicken Curry : నాన్ వెజ్ అనగానే.. మెజారిటీ జనం మదిలో మెదిలే రెసిపీ చికెన్. దీని ధర సామాన్యులకు కూడా అందుబాటులో ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. అయితే.. మారిన పరిస్థితుల కారణంగా జనం ఫామ్ చికెన్ తింటున్నారు గానీ.. అసలైన చికెన్ అంటే.. నాటు కోడి మాత్రమే! ముఖ్యంగా.. తెలంగాణలో నాటు కోడికూరకు ఉండే డిమాండ్ వేరే. చేయి తిరిగిన కుక్ వండాలేగానీ.. అద్భుతమే. మరి, అలాంటి నాటుకోడి కూరను తెలంగాణ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో.. ఈ స్టోరీలో చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- కేజీన్నర బరువుండే నాటు కోడి
- 1 కప్పు ఉల్లిపాయలు
- 5 స్పూన్ల కారం
- 4 స్పూన్ల ఉప్పు
- 1 స్పూన్ జీలకర్ర పొడి
- 2 స్పూన్ల ధనియాల పొడి
- 1 స్పూన్ పసుపు
- 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్
- 1/2 టీస్పూన్ షాజీరా
- 1/4 స్పూన్ మిరియాలు
- ఒక ఎండు కొబ్బరి చెక్క
- 2 టేబుల్ స్పూన్లు గసగసాలు
- 3 ముక్కలు దాల్చిన చెక్క
- 5 యాలకులు
- 7 నుండి 8 లవంగాలు
- నూనె సరిపడా
రాయలసీమ మాంసం కూర.. వాసనకే నోరూర!
తయారీ విధానం ఇలా..
- ముందుగా మసాలా సిద్ధం చేయాలి.
- స్టౌ మీద పాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ల తురిమిన ఎండిన కొబ్బరిని వేయాలి.
- తర్వాత 2 టేబుల్ స్పూన్ల గసగసాలు వేసి బాగా వేయించాలి.
- ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేయండి. లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, షాజీరా, మిరియాలు వేసి మిక్సీ పట్టండి. దీంతో మసాలా సిద్ధమైపోతుంది.
- ఇప్పుడు స్టౌ మీద బాణాలి పెట్టి.. 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయండి.
- ఆయిల్ వేడెక్కిన తర్వాత.. 3 తరిగిన ఉల్లిపాయలు వేయాలి.
- ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి.
- ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి బాగా కలపాలి.
- ఇప్పుడు చికెన్ ముక్కలను వేసి కలపాలి.
- తర్వాత మూతపెట్టి 5 నుంచి 6 నిమిషాలు ఉడికించాలి.
- ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న.. మసాలా పేస్ట్‌ను యాడ్ చేయాలి.
- మూత పెట్టి మరో 2-3 నిమిషాలు ఉడికించాలి.
- ఇప్పుడు కారం వేయాలి.
- కాసేపటి తర్వాత.. ఉప్పు, కొత్తిమీర పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి.
- మరి కాసేపటి తర్వాత.. నీళ్లు యాడ్ చేయాలి. గ్రేవీ ఎంత ఉండాలన్నదానిపై నీళ్లు ఎన్ని గ్లాసులు పోయాలనేది నిర్ణయించండి. ఇప్పుడు ఈ చికెన్ ఎక్కువసేపు ఉడికించాలి.
- చక్కగా ఉడికిందని నిర్ధారించుకున్న తర్వాత.. కొత్తిమీర వేయాలి.
- అంతే.. అద్దిరిపోయే నాటు కోడి కూర.. సిద్ధమైపోతుంది.
- అన్నంతో అయినా సరే.. జొన్న రొట్టె, చపాతీలో అయినా సరే.. అద్భుతమైన రుచిని ఆస్వాదించడం గ్యారెంటీ.
How to Prepare Mutton Curry : సండే పండగ.. అద్దిరిపోయే మటన్ కర్రీ.. ఇలా చేయండి!