How To Organize Small Home Like Beautiful : చిన్న ఇంటిని కూడా అందంగా సర్దుకోవడం ఒక కళ. ఇళ్లు పెద్దదైనా లేక చిన్నదైనా దాన్ని చక్కగా సర్దుకోవడంలోనే దాని అందం దాగి ఉంటుంది. ఆఫీసులో కష్టపడి పని చేసి వచ్చిన తరవాత.. ఇళ్లంతా ఇరుకుగా ఉండి, వస్తువులన్నీ చిందర వందరంగా ఉంటే ఎక్కడ లేని చిరాకు అంత బయటికి వస్తుంది. అటు ఆఫీసులో పని, మళ్లీ ఇంట్లో పని చేయాలంటే చాలా మందికి ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇలా అనిపించకూడదు అంటే ఇంట్లో ఫర్నిచర్ కొనేటప్పుడు, ఇంటికి రంగులు వేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. చిన్న ఇంటిని కూడా పెద్దగా, అందంగా కనిపించేలా చేసే కొన్ని టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
1. లైట్ కలర్స్ ఉపయోగించండి.. : మీరు ఇంటిని నిర్మించిన తరవాత.. గోడలకు వేసే రంగులు లైట్ కలర్‌లో ఉండేలా చూసుకోండి. ఇలా చేయడం వల్ల రూమ్‌లోకి అడుగు పెట్టగానే ప్రశాంతమైన ఫీలింగ్ కలుగుతుంది. అలాగే మీరు ఇంట్లోకి కొనుగోలు చేసే ఫర్నిచర్, ఫ్లోరింగ్‌లను కూడా లైట్ కలర్‌లో ఉండేవి ఎంపిక చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీ గది పెద్దగా, ఆహ్లాదకరంగా, ఓపెన్‌గా ఉన్నట్లు కనిపిస్తుంది. వైట్, బీజ్, గ్రే, స్కై బ్లూ, లైట్ ఎల్లో, లేత గులాబీ రంగులను వేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
2.ఫర్నీచర్ చిన్నగా ఉండాలి..: మన ఇల్లు ఒకవేళ చిన్నగా ఉండి.. పెద్ద ఫర్నీచర్ పెడితే చూడ్డానికి మరింత చిన్నగా కనిపిస్తుంది. అలా కనిపించకూడదంటే మీరు ఫర్నీచర్ కొనుగోలు చేసేటప్పుడు చిన్నగా ఉన్నది ఎంపిక చేసుకోండి. చిన్న ఫర్నీచరే ఒక్కోసారి కంఫర్టబుల్‌గా ఉంటుందని గుర్తుంచుకోండి.
3.అద్దాలను ఉపయోగించండి..: ఇంట్లో మీకు వీలున్న చోట అద్దాలను పెట్టండి. అద్దాలు కాంతిని ప్రతిబింబించి వీక్షణను కూడా ప్రతిబింబిస్తాయి. దీంతో రూమ్ చిన్నగా ఉన్నా సరే ఎక్కువ స్పేస్ ఉన్నట్లుగా కనిపిస్తుంది.
4. సూర్య కాంతి పడేలా చూసుకోండి..: ఇంట్లో సూర్య కాంతి ఎక్కువ పడేలా చూసుకోండి. ఇందుకోసం కిటికీలు, తలుపులను ఎల్లప్పుడూ తెరిచి ఉంచండి. దీంతో వెలుతురు రావడమే కాకుండా ఇంట్లో స్పేస్ ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది.
5.మల్టీ పర్పస్ ఐటెమ్స్..: ఇల్లు చిన్నగా ఉంది కదా అని ఏ వస్తువులు తీసుకోకుండా ఉండడం కూడా మంచిది కాదు. కానీ, మనం కొనే వస్తువులు ఒకేరకంగా కాకుండా అనేక రకాలుగా ఉపయోగపడేలా చూసుకోండి. ఉదాహారణకి ఫోల్డింగ్ బెడ్.. దీనిని కొన్ని సార్లు బెడ్‌లా, మరోసారి సోఫాలా కూడా వాడొచ్చు. ఇలాంటివి మార్కెట్లో చాలానే ఉంటాయి. మీరు ఏదైనా ఫర్నీచర్ కొనుగోలు చేసేటప్పుడు ఫోల్డింగ్ ఫర్నీచర్‌కు ప్రిఫర్ చేయండి.
గీజర్ కొనడానికి ప్లాన్ చేస్తున్నారా? - అయితే ఈ బెస్ట్ మోడల్స్‌పై ఓ లుక్కేయండి!