ETV Bharat / bharat

మీ పిల్లలు ఇంగ్లీష్‌ మాట్లాడలేకపోతున్నారా? ఇలా చేస్తే గలగలా మాట్లాడుతారు! - పిల్లలకు ఇంగ్లీష్‌ను ఎలా నేర్పించాలి

How To Improve Childrens English Language Skills : ఈ రోజుల్లో మెజారిటీ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు. కానీ.. అందులో ఇంగ్లీష్ చక్కగా మాట్లాడేవారి శాతం మాత్రం చాలా తక్కువ. మీ పిల్లలు కూడా ఇంగ్లీష్ మాట్లాడడంలో ఇబ్బంది ఎదుర్కొంటున్నారా? అయితే.. ఈ స్టోరీ మీకోసమే!

How To Improve Childrens English Language Skills

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 16, 2023, 5:23 PM IST

How To Improve Childrens English Language Skills : పిల్లలు చక్కగా ఇంగ్లీష్​ మాట్లాడాలని భావించే తల్లిదండ్రులు.. వారికి చిన్నప్పటి నుంచే ఇంగ్లీష్ లాంగ్వేజ్‌ స్కిల్స్‌ను నేర్పించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం స్వయంగా పేరెంట్స్ కొంత "హోం వర్క్" చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. అప్పుడే.. పిల్లలు ఇంగ్లీష్‌ భాషా నైపుణ్యాలను సరిగ్గా నేర్చుకోగలరని అంటున్నారు. మరి.. పేరెంట్స్​ ఏం చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

చిన్నవయసు నుంచే :
చిన్నపిల్లలకు ఇంగ్లీష్‌ భాషలో నైపుణ్యాలను నేర్పించడానికి.. పిల్లల వయస్సు రెండు మూడేళ్లు ఉన్నప్పటి నుంచే తల్లిదండ్రులు ప్రారంభించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ వయస్సులో పిల్లలు చిన్నచిన్న పదాలను మాట్లాడటం, తల్లిదండ్రుల మాటలను అర్థం చేసుకోవటం ప్రారంభిస్తారని అంటున్నారు. వినడం, మాట్లాడటం, చదవడం, రాయడం ద్వారా పిల్లలు త్వరగా భాష నైపుణ్యాలను నేర్చుకుంటారని తెలియజేస్తున్నారు.

రెగ్యూలర్‌గా చదవడం, రాయడం:
పిల్లలు ఇంగ్లీష్‌ భాషలో నైపుణ్యం సాధించడానికి తల్లిదండ్రులు వారితో తరచూ చిన్నచిన్న రైమ్స్, స్టోరీస్‌, వర్డ్స్‌ రాయించాలి. చదివించాలి. ఇలా చేయడం వల్ల వారిలో ఇంగ్లీష్‌ పట్ల ఉన్న భయం తొలగిపోయి ఈజీగా నేర్చుకుంటారు.

ఇంట్లో మాట్లాడండి :
మీ పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు వారితో ఇంగ్లీష్‌లోనే మాట్లాడండి. వీలైతే కుటుంబ సభ్యులందరూ ఇంగ్లీష్‌లోనే మాట్లాడాలి. ఇలా చేయడం వల్ల వారు తొందరగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది.

మీ పిల్లలు నిత్యం నవ్వుతూ ఉండాలా? - అయితే ఈ 5 విషయాలు చెప్పండి!

రోజుకో కొత్త ఇంగ్లీష్ పదం నేర్పించండి :
పిల్లలు ఇంగ్లీష్ భాషలో నైపుణ్యం సంపాదించడానికి తల్లిదండ్రులు వారికి రోజుకు ఒక కొత్త పదాన్ని నేర్పించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆ కొత్త పదాలు ఏ విధంగా ఉపయోగించవచ్చో వాక్యాల రూపంలో తెలియజేయాలని చెబుతున్నారు. దీనివల్ల వారిలో భాష స్థాయి పెరుగుతుందని అంటున్నారు.

అనువైన వాతావరణం కల్పించండి :
పిల్లలు ఇంగ్లీష్‌ నేర్చుకోవడానికి ఉపయోగపడే పుస్తకాలు, మ్యాగజైన్‌ల వంటి వాటిని తల్లిదండ్రులు అందుబాటులో ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఇంగ్లీష్‌ సినిమాలు, టీవీ షోలను చూడటం అలవాటు చేయాలని అంటున్నారు. దీనివల్ల వారు ఇంగ్లీష్‌ను ఎలా మాట్లాడాలో తెలుసుకుంటారని చెబుతున్నారు.

లైబ్రరీ లేదా బుక్‌హౌస్‌లకు తీసుకెళ్లండి :
పిల్లల స్కూళ్లకు సెలవు ఉన్న రోజుల్లో.. వారిని అలా లైబ్రరీకి లేదా బుక్‌హౌస్‌కు తీసుకెళ్లాలి. అక్కడ ఉన్న వివిధ ఇంగ్లీష్‌ పుస్తకాలను చూడడం, చదవడం వల్ల వారిలో ఆలోచనా శక్తి పెరుగుతుంది. ఇది అలవాటుగా మారితే వారు మంచి ఉన్నత స్థానానికి వెళ్తారు.

సాంస్కృతిక కార్యక్రమాలు :
పాఠశాలలో జరిగే ఇంగ్లీష్ ఈవెంట్‌లు, సాంస్కృతిక కార్యక్రమాలలో మీ పిల్లలు పాల్గోనేలా ప్రోత్సహించండి. ఇలా నలుగురిలో వారు ఇంగ్లీష్‌లో మాట్లాడటం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

ఎడ్యుకేషనల్ యాప్స్‌ :
ఈ రోజుల్లో పిల్లలకు ఇంగ్లీష్‌ భాషను నేర్పించడానికి చాలా రకాల ఎడ్యుకేషనల్ యాప్‌లు, గేమ్‌లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటిని సక్రమంగా ఉపయోగించడం ద్వారా పిల్లలకు ఇంగ్లీష్ వొకాబులరీ, గ్రామర్‌ నేర్పించవచ్చు.

పైన తెలిపిన అన్ని పాటిస్తూ.. వారు నేర్చుకునే సమయంలో ఏమైనా తప్పులు చేస్తే వాటిని గుర్తించి సరిచేయాలి. ఇంగ్లీష్‌ భాష అనేది ఒక్క రోజులో రాదు కాబట్టి, వారిని నిరంతరం ప్రోత్సహించడం ద్వారా బెస్ట్ రిజల్ట్ ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

ల్యాప్​టాప్​ ఒడిలో పెట్టుకుని వర్క్​ చేస్తున్నారా? బీ కేర్​ ఫుల్​- ఈ సమస్యలకు వెల్​కమ్​ చెప్పినట్లే!

రాత్రి పూట హాయిగా నిద్ర పట్టాలా? ఈ ఆహారాలకు దూరంగా ఉండండి!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.