How to Check EPFO Balance: ఉద్యోగంలో చేరినా ప్రతి ఒక్కరూ 'ఉద్యోగుల భవిష్య నిధి (EPF)' గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఉద్యోగంలో చేరిన రోజు నుంచి.. రిటైర్‌మెంట్ అయ్యే రోజు వరకూ ఎంతో కొంత డబ్బును పొదుపు చేయాలనుకుంటారు. అలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్ చట్టం కింద 1952లో ఈపీఎఫ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ మేరకు డబ్బును పొదుపు చేయాలని అనుకుంటున్న ఉద్యోగులు కచ్చితంగా ఈ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్)పై అవగాహన పెంచుకోవాలి. ప్రతి నెలా ఉద్యోగి జీతంలోంచి కొంత డబ్బు ఈపీఎఫ్ ఖాతాలోకి జమవుతూ ఉంటుంది. అయితే.. చాలామందికి వారి పీఎఫ్ ఖాతాలో ఎంత సొమ్ము ఉంది..? దానిని ఎలా తెలుసుకోవాలి..? అనుసరించాల్సిన పద్ధతులు ఏమిటి..? వంటి వివరాలు తెలియదు. అలాంటి వారికోసమే ఈ స్టోరీ..
ఈపీఎఫ్‌వో బ్యాలెన్స్ తనిఖీ చేయడానికి నాలుగు మార్గాలు..
Four Ways to Check EPFO Balance: ఈపీఎఫ్ ఖాతాలో ఉన్న సొమ్మును తనీఖీ చేయడానికి 4 పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. అందులో మొదటిది SMS ద్వారా బ్యాలెన్స్ తనిఖీ చేసుకోవటం. రెండవది.. మిస్డ్ కాల్స్ ద్వారా తనీఖీ చేసుకోవటం. మూడవది.. ఉమంగ్ యాప్ ద్వారా, నాల్గవది.. EPF పోర్టల్ ద్వారా మీ పీఎఫ్ ఖాతాలో ఎంత సొమ్ము ఉందో తెలుసుకోవచ్చు.
How to Get PPO Number in Online : ప్రైవేట్ ఉద్యోగులారా.. పీపీఓ నంబర్ తెలుసుకున్నారా..?
మొదటి దశ..
First step: పీఎఫ్ ఖాతాలోని బ్యాలెన్స్ వివరాలను ఎస్ఎఎస్ సదుపాయంతో మొబైల్‌లోనే తెలుసుకోవచ్చు. అందుకోసం ఈపీఎఫ్ఓలో రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నంబర్ నుంచి "EPFOHO UAN LAN" అని 7738299899 నెంబర్‌కి మెసేజ్ పంపించాలి. ఆ తర్వాత మీ మొబైల్‌కి ఓ సందేశం వస్తుంది. అందులో ఈపీఎఫ్ అకౌంట్ సహా అందులోని బ్యాలెన్స్ వంటి తదితర వివరాలు ఉంటాయి.
రెండవ దశ..
Second step: మీ పీఎఫ్ ఖాతాలోని బ్యాలెన్స్ వివరాలను మిస్డ్ కాల్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. అందుకు మీరు ముందుగా చేయాల్సింది.. మీ రిజిస్టర్డ్ మొబైల్ నుంచి 011-22901406 నెంబర్‌కి మిస్డ్ కాల్ ఇవ్వాలి. రింగ్ అయిన వెంటనే కాల్ ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది. ఆ తర్వాత కొద్దిసేపటికే ఈపీఎఫ్ ఖాతా, అందులోని బ్యాలెన్స్ వంటి వివరాలతో కూడిన మెసేజ్ వస్తుంది.
మూడవ దశ..
third step: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉమాంగ్ యాప్ ద్వారా కూడా మీ పీఎఫ్ అకౌంట్‌లో ఉన్న బ్యాలెన్స్ వివరాలను తెలుసుకోవచ్చు. అందుకు ముందుగా మీరు చేయాల్సింది.. ప్లేస్టోర్ నుంచి ఉమాంగ్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకుని లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత అందులో ఈపీఎఫ్‌ఓ ఆప్షన్ ఎంచుకోని.. యూఏఎన్ నంబర్ నమోదు చేయాలి. వెంటనే మీ ఫోన్‌కు ఓ ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీ పీఎఫ్ ఖాతా వివరాలు స్క్రీన్‌పై వస్తాయి.
నాల్గవ దశ..
fourth step: ఈపీఎఫ్ఓ మెంబర్ పాస్ బుక్ పోర్టల్ ద్వారా కూడా లాగిన్ అయ్యి.. పీఎఫ్ ఖాతాలో ఉన్న బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోవచ్చు. అదేలా అంటే.. ముందుగా మీకు యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్) నెంబర్ తప్పనిసరిగా ఉండాలి. ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్‌లో యూఏఎన్ (UAN) నెంబర్, పాస్ వర్డ్ ద్వారా లాగిన్ అయి.. పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. అందుకు ఈపీఎఫ్ఓ పోర్టల్ http://www.epfindia.gov.in లోకి వెళ్లి.. పైన అవర్ సర్వీసెస్ ఆప్షన్లలో రెండోది ఎంప్లాయిస్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాతి పేజీలో కింది భాగంలో సర్వీసెస్‌లో మెంబర్ పాస్‌బుక్ అని ఉంటుంది. దానిపై క్లిక్ చేసి యూఏఎన్ నెంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేస్తే బ్యాలెన్స్ వివరాలతో కూడిన పాస్ బుక్ వస్తుంది. అలాగే, నేరుగా పాస్‌బుక్ పేజీలోకి వెళ్లాలంటే https://passbook.epfindia.gov.in/MemberPassBook/Login లింక్ ద్వారా లాగిన్ కావొచ్చు.
PF Interest 2023 : పీఎఫ్ వడ్డీ జమ ప్రక్రియ మొదలైంది.. ఇలా సింపుల్‌గా చెక్ చేసుకోండి!
Multiple EPF Accounts Merge : వేర్వేరు ఈపీఎఫ్ ఖాతాలు ఉన్నాయా?.. వెంటనే వాటిని మెర్జ్ చేసుకోండి!