ETV Bharat / bharat

How to Apply For Duplicate Voter ID Card in Online : ఓటర్ కార్డు పోయిందా..? డోన్ట్​వర్రీ.. ఇలా పొందండి! - ఓటర్ ఐడీ

How to Apply Duplicate Voter ID Card Online : మీ ఓటర్ ఐడీ ఎక్కడో పోయిందా..? ఇప్పుడేం చేయాలా.. అని ఆలోచిస్తున్నారా? డోన్ట్​వర్రీ. సింపుల్​గా ఓటర్ కార్డు ఇలా పొందండి!

Voter ID
Duplicate Voter ID Card
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 10, 2023, 10:59 AM IST

Updated : Sep 10, 2023, 11:20 AM IST

How to Get Duplicate Voter ID Card in Telugu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్నాయి. అటు.. పార్లమెంట్​ ఎన్నికలకూ(Parliament Elections) సమయం దగ్గర పడుతోంది. ఆయా ఎన్నికల్లో ఓటు వేయడానికి ఓటరు ఐడీ చాలా కీలకం. అయితే.. చాలా మంది ఓటు వేసే సమయంలోనే కార్డుకోసం వెతుకుతుంటారు. ఒక్కోసారి ఓటర్ ఐడీ దొరక్కపోవచ్చు. లేదా ఎక్కడైనా పెడితే చెదలు పట్టి చిరిగిపోవచ్చు. ఎక్కడైనా జారీ పోవచ్చు. మీరు ఇలాంటి పరిస్థితిలో ఉంటేగనక.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. డూప్లికేట్ ఓటర్​ ఐడీ(Duplicate voter ID)కోసం అప్లై చేసుకుని దాన్ని. ఈజీగా పొందొచ్చు. అది ఎలాగో ఇక్కడ చూద్దాం.

Duplicate Voter ID Card Details in Telugu : డూప్లికేట్ ఓటర్ ఐడీ కోసం ఆన్​లైన్​ సర్వీస్​ సెంటర్లు, మీ సేవా కేంద్రాలతోపాటు.. చివరకు మీ మొబైల్ ఫోన్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. ఆఫ్​లైన్ విధానంలో కావాలనుకుంటే.. సమీపంలోని ఎన్నికల కార్యాలయాన్ని సందర్శించడం ద్వారా కూడా డూప్లికేట్ ఓటర్ ఐడీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

డూప్లికేట్ ఓటర్ ఐడీ దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు..

Required Documents for Duplicate Voter ID :

  • సరిగ్గా పూరించిన దరఖాస్తు ఫాం నంబర్ EPIC-002
  • FRI (ఓటర్ కార్డు పోయినట్లు.. పోలీస్ స్టేషన్ నుంచి ఇచ్చే కాపీ)
  • అడ్రస్ ప్రూఫ్
  • గుర్తింపు కార్డు(ఐడెంటిటీ ప్రూఫ్)
  • పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు

New Voter ID Application : కొత్త ఓటర్​ ఐడీ కార్డు పొందడం ఇంత తేలికా.. అయితే ఇప్పుడే అప్లై చేసేద్దాం..

How to Apply for Duplicate Voter ID Card in Online Process :

ఆన్​లైన్​లో డూప్లికేట్ ఐడీ కార్డు కోసం ఎలా అప్లై చేసుకోవాలంటే..

  • మొదట రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వెబ్‌సైట్ ను సందర్శించాలి.
  • డూప్లికేట్ ఓటర్ ID కార్డుకోసం అప్లై చేయడానికి.. ఫాం EPIC-002 కాపీని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత ఈ ఫాం సరిగ్గా పూరించాలి.
  • ఫాంలో పేర్కొన్న విధంగా అవసరమైన అన్ని పత్రాలను అటాచ్ చేయాలి.
  • ఓటర్ ఐడీ పోయినట్టుగా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు కాపీ (ఎఫ్‌ఐఆర్), చిరునామా, గుర్తింపు రుజువు పత్రాలు జతచేయాలి.
  • అనంతరం ఆ ఫాం ను స్థానిక ఎన్నికల కార్యాలయానికి సమర్పించాలి. అప్పుడు మీకు రిఫరెన్స్ నంబర్ వస్తుంది.
  • వచ్చిన రిఫరెన్స్ నంబర్ ద్వారా రాష్ట్ర ఎన్నికల కార్యాలయ వెబ్‌సైట్‌లో మీ దరఖాస్తు స్టేటస్ ట్రాక్ చేయవచ్చు.
  • మీ అప్లికేషన్ వెరిఫికేషన్ ప్రక్రియ విజయవంతంగా పూర్తి అయ్యాక.. కార్డు జారీ చేసినట్టు మీకు సందేశం వస్తుంది.

How to Apply for Duplicate Voter ID Card in Offline Process :

ఆఫ్‌లైన్ విధానంలో డూప్లికేట్ ఓటర్ ఐడీ ఎలా అప్లై చేసుకోవాలంటే..

  • ముందుగా ఓటరు కార్డు పోయినట్లు పోలీసులకు తెలియజేసి ఎఫ్‌ఐఆర్‌.. నమోదు చేయించి ఆ కాపీ మీ దగ్గర ఉంచుకోవాలి.
  • ఇప్పుడు మీకు సమీపంలోని స్థానిక ఎన్నికల కార్యాలయాన్ని సందర్శించాలి.
  • ఆ తర్వాత డూప్లికేట్ ఓటర్ ఐడీ కోసం.. EPIC-002 ఫాంను తీసుకుని సంబంధిత వివరాలతో ఫాంను సరిగ్గా పూరించాలి.
  • అనంతరం FIR కాపీ, మీ పాస్‌పోర్ట్ సైజు ఫొటో, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ లేదా రేషన్ కార్డ్ మొదలైన గుర్తింపు రుజువును అందించే పత్రాలను ఆ ఫాంకు అటాచ్ చేయాలి.
  • అలాగే చిరునామా రుజువు కోసం మీ గ్యాస్ బిల్లు, విద్యుత్ బిల్లు, టెలిఫోన్ బిల్లు, పాస్‌పోర్ట్ మొదలైన వాటిలో ఏదో ఒక జిరాక్స్ కాపీని దానికి జత చేయాలి.
  • అన్ని పత్రాలతో స్థానిక ఎన్నికల కార్యాలయంలో దరఖాస్తును సమర్పించండి.
  • మీ అప్లికేషన్ స్టేటస్ ట్రాక్ చేయడానికి రిఫరెన్సు నంబర్ ఇస్తారు.
  • ఎన్నికల అధికారి వెరిఫికేషన్ పూర్తయ్యాక మీకు డూప్లికేట్ ఓటర్ ఐడీని జారీ చేస్తారు.
  • ఈ కార్డు జారీ అయినట్లు మీకు మెసేజ్ రాగానే.. ఎలక్టోరల్ కార్యాలయం నుంచి వ్యక్తిగతంగా మీరు కార్డును తీసుకోవచ్చు.

ఓటర్​ ఐడీతో ఆధార్ లింక్ చేశారా?.. గడువుపై కేంద్రం కీలక నిర్ణయం

ఓటరు కార్డు ఇక డిజిటల్​ రూపంలో...

Last Updated : Sep 10, 2023, 11:20 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.