ETV Bharat / bharat

డీఎంకే సక్సెస్​ మంత్ర.. 'స్టాలిన్​'! - ఎంకే స్టాలిన్​ జీవిత విశేషాలు

"ఒక్క ఛాన్స్​... ఒకే ఒక్క ఛాన్స్..!"​ అంటూ తమిళ ప్రజల మనసు దోచుకున్నారు ఆయన. ఇప్పుడు ఆయన పేరే ఓ ప్రభంజనం. 2021 తమిళనాడు ఎన్నికల్లో డీఎంకేకు ప్రజలు పట్టంగట్టారంటే.. అందుకు కారణం ఆయనే. పార్టీకి అన్నీ తానై ముందుండి నడిపించి.. త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న ఆయనే ఎంకే స్టాలిన్​.

stalin in tamilanadu
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం
author img

By

Published : May 2, 2021, 9:39 PM IST

Updated : May 2, 2021, 9:45 PM IST

దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి వారసుడిగా రాజకీయాల్లో ఇంతకాలం చెరగని ముద్ర వేసుకున్న స్టాలిన్.​. ఇక సీఎం పీఠాన్ని అధిరోహించి తండ్రి అడుగుజాడల్లో రాష్ట్రాన్ని పరిపాలించేందుకు సిద్ధమవుతున్నారు.

'పేరు'లోనే మ్యాజిక్​...

కరుణానిధి- దయాలు అమ్మల్​ రెండో కుమారుడు స్టాలిన్​. స్టాలిన్​ పుట్టిన నాలుగో రోజే ప్రపంచ ప్రఖ్యాత సోవియెట్​ నేత జోసెఫ్​ స్టాలిన్​ కన్నమూశారు. ఆయనకు గుర్తుగా.. కుమారుడికి స్టాలిన్​ అని నామకరణం చేశారు కరుణానిధి.

stalin in tamilanadu
స్టాలిన్​ జీవిత విశేషాలు

రాజకీయాల్లో స్టాలిన్​...

తండ్రికి తగ్గ తనయుడిగా.. యుక్త వయసు నుంచే రాజకీయాల్లో చురుకుగా ఉండటం మొదలు పెట్టారు స్టాలిన్​. ఓ టీ స్టాల్​లో.. డీఎంకే తరఫున గోపాలపురం యువజన విభాగాన్ని ఏర్పాటు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. 14ఏళ్లకే కుటుంబసభ్యుల తరఫున ఎన్నికల ప్రచారాలు నిర్వహించారు.

ఇలా అంచెలంచెలుగా ఎదుగుతున్న స్టాలిన్​ను 2013 జనవరి 3న తన రాజకీయ వారసుడిగా ప్రకటించారు కరుణానిధి. దివంగత నేత మరణాంతరం డీఎంకే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు స్టాలిన్​.

stalin in tamilanadu
స్టాలిన్​ రాజకీయ ప్రస్థానం

అప్పుడే మార్క్​...!

రాష్ట్ర రాజకీయాల్లో.. స్టాలిన్​ తన మార్క్​ను 2019లోనే వేశారు. అప్పుడు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 40 పార్లమెంట్​ సీట్లకు గానూ 39 స్థానాల్లో విజయఢంకా మోగించింది డీఎంకే కూటమి. ఆ తర్వత జరిగిన ఉపఎన్నికల్లో 52శాతం ఓట్లతో దూసుకుపోయింది స్టాలిన్​ నేతృత్వంలోని విపక్ష కూటమి. ఇక అసెంబ్లీ సమరంలోనూ ప్రజలు స్టాలిన్​కే పట్టం గట్టి.. ముఖ్యమంత్రిని చేశారు.

ఇదీ చూడండి: 'అధికారంలోకి వస్తే సీఏఏ అమలును అడ్డుకుంటాం'

ఇదీ చూడండి: 'తమిళవాదం'పై డీఎంకే, అన్నాడీఎంకే ఏకస్వరం

Last Updated : May 2, 2021, 9:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.