ETV Bharat / bharat

సవాళ్లే 'విజయ'న్​ సోపానాలు - కేరళ ఫలితాలు

2021 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో జయకేతనం ఎగరేసి రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించారు పినరయి విజయన్​. ఆయన పనితీరును మెచ్చిన కేరళవాసులు.. అనాదిగా వస్తున్న సంప్రదాయానికి స్వస్తి పలికి తిరిగి పట్టం గట్టారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా, ఎన్ని విమర్శలు వచ్చినా.. వాటన్నింటినీ ఎదుర్కొని ప్రజా పరీక్షలో విజయం సాధించారు విజయన్​.

pinarayi vijayan
కేరళలో వామపక్షాలు
author img

By

Published : May 2, 2021, 4:21 PM IST

దేశ రాజకీయాల్లో కేరళది ప్రత్యేక స్థానం. ఇక్కడ ఎంత భారీ స్థాయిలో అభివృద్ధి జరిగినా.. ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో అధికార మార్పిడికే ఓటు వేస్తారు కేరళవాసులు. ఎన్నోమార్లు ఈ విషయం రుజువైంది కూడా. అలాంటిది.. 2021 ఎన్నికల్లో తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుని చరిత్ర సృష్టించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్​. ఎన్నో సవాళ్లు.. మరెన్నో ఆరోపణలను ఎదుర్కొని.. ముందుకు సాగి విజయ తీరాలకు చేరారు విజయన్​. సీఎం పీఠంపై కూర్చునే అర్హత తనకు ముమ్మాటికీ ఉందని నిరూపించుకున్నారు.

జీవితం..

విజయన్​ పూర్తి పేరు పినరయి విజయన్​. ఆయన పుట్టింది.. 1945 మే 24న నాటి మద్రాసు ప్రావిన్సులోని మలబార్​ జిల్లాలో. విజయన్ తల్లిదండ్రులు కోరన్​, కల్యాణి. గవర్నమెంట్​ బ్రెన్నెన్​ కాలేజీలో బీఏ ఎకనామిక్స్​ పూర్తి చేసిన ఆయనకు ఇద్దరు సంతానం. భార్య కమల.. విజయన్​ వెన్నంటే ఉంటారు.

బ్రెన్నెన్​ కళాశాల నుంచే విజయన్​ రాజకీయ ప్రస్థానం మొదలైంది. నాటి విద్యార్థి సంఘాల్లో ఆయన చురుకుగా ఉండేవారు. అనంతరం సీపీఎం​లో చేరి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.

pinarayi vijayan
రాజకీయ 'విజయన్​'

ప్రత్యేకం...!

నిజానికి.. ఈ ఎన్నికల్లో గెలుపొందడం విజయన్​కు కూడా ఎంతో ప్రత్యేకం! అటు నిపా.. ఇటు కరోనా.. ఓవైపు గోల్డ్​ స్కాం, మరోవైపు శబరిమల... ఇలా ఎన్నో సవాళ్లను విజయన్​ ఎదుర్కొన్నారు. వాటన్నింటికి ఎదురీది.. ప్రజల నుంచి క్లీన్​ చిట్ పొందారు. ప్రజా పరీక్షలో విజయం సాధించి మళ్లీ సీఎం కుర్చీని అధిరోహిస్తున్నారు.

pinarayi vijayan
'విజయ'న్ మంత్రం

ఇదీ చూడండి: కేరళలో కామ్రేడ్ల హవా- యూడీఎఫ్​కు నిరాశ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.