ETV Bharat / bharat

'రహదారులు దిగ్బంధిస్తే సమస్యలు పరిష్కారమవుతాయా?' - సుప్రీంకోర్టు వార్తలు తాజా

జాతీయ రహదారులను దిగ్బంధించడం (highways blocked by protests) సమస్యకు పరిష్కారం కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రహదారులపై నిరసనలు ఎలా చేపడతారని ప్రశ్నించింది. రోడ్ల దిగ్బంధనంపై దాఖలైన పిటిషన్​ విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.

supreme court news, సుప్రీంకోర్టు వార్తలు తాజా
'పరిష్కారం కోసం రహదారుల దిగ్బంధం సరికాదు'
author img

By

Published : Sep 30, 2021, 2:29 PM IST

రోడ్ల దిగ్బంధనంతో ఇబ్బందులు వస్తున్నాయన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది. నిరసనలు చేపడుతూ జాతీయ రహదారులను (highways blocked by protests) నిత్యం ఎలా దిగ్బంధిస్తారని జస్టిస్​ సంజయ్​ కిషన్​ కౌల్​ ఆధ్వర్యంలోని ధర్మాసనం ప్రశ్నించింది. నిర్దేశించిన ప్రాంతాల్లోనే ఆందోళనలు, నిరసనలు చేపట్టాలని (farmers protest) సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జ్యుడీషియల్ ఫోరం, పార్లమెంటరీ చర్చలతోనే పరిష్కారం లభిస్తుందని వ్యాఖ్యానించింది.

'పీడకలలా మారింది'

దిల్లీ-ఉత్తర్​ప్రదేశ్​ సరిహద్దు వద్ద నిరసనల కారణంగా నోయిడా నుంచి దిల్లీలోని కార్యాలయానికి వెళ్లడం పీడకలలా మారిందని.. 20 నిమిషాల ప్రయాణానికి 2 గంటలు పడుతోందని పిటిషనర్​ పేర్కొన్నారు. రోడ్ల దిగ్బంధనంతో (highways blocked by protests) రాకపోకల్లో జాప్యం జరుగుతోందని తెలిపారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. రహదారుల దిగ్భంధం సమస్యకు పరిష్కారం కాదని పేర్కొంది.

'వారిని ప్రతివాదులుగా చేర్చండి'

ధర్మాసనం వ్యాఖ్యలపై స్పందించిన సొలిసిటర్​ జనరల్​ తుషార్ మెహతా.. సమస్య పరిష్కారానికి ఉన్నతస్థాయి కమిటీ నియమించామని వెల్లడించారు. చర్చలకు నిరసనకారులు (farmers protest) నిరాకరించారని.. వారిని ప్రతివాదులుగా చేర్చాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు.

ఇందుకు సంబంధించి పిటిషన్‌ దాఖలు చేయాలని ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది.

'ప్రయత్నించాము కానీ..'

నిరసన విరమణ యత్నాలపై హరియాణా ప్రభుత్వం అఫిడవిట్​ దాఖలు చేసింది. గతంలో సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాలపై హరియాణా ప్రభుత్వం ఈ విధంగా స్పందించింది.

తదుపరి విచారణను ధర్మాసనం సోమవారానికి వాయిదా వేసింది.

ఇదీ చూడండి : 'ఒక్క క్లిక్​ దూరంలోనే మెరుగైన వైద్య సేవలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.