ETV Bharat / bharat

ఏసీతో కరోనా వ్యాప్తి.. ఎలాగంటే.?

author img

By

Published : Feb 10, 2021, 10:29 PM IST

వెంటిలేషన్​, ఎయిర్​ కండిషనింగ్​ ద్వారా కరోనా వైరస్​ ఎలా వ్యాప్తి చెందుతుందనే అంశంపై పరిశోధనలు చేశారు శాస్త్రవేత్తలు. చైనాలో జరిగిన ఈ పరిశోధనలకు అధునాతన సాంకేతిక పరికరాలను ఉపయోగించినట్టు చెప్పారు. తమ పరిశోధనల్లో రెస్టారంట్లలోని వైరస్‌ కణాలు రెండు రకాలుగా వ్యాపిస్తున్నట్లు గుర్తించామన్నారు. అందులో ఒకటి బల్లల కింద నుంచి ప్రసరించే ఏరోసోల్‌ కణాలు పెరగడం, రెండోది ఏసీల ద్వారా వృద్ధి చెందడమని తెలిపారు.

How air conditioning spreads coronavirus aerosols decoded
ఏసీతో కరోనా వ్యాప్తి.. ఎలాగంటే.?

వెంటిలేషన్‌, ఎయిర్‌ కండిషనింగ్‌ కరోనా వైరస్‌ వ్యాప్తిని ఎలా ప్రభావితం చేస్తాయన్న అంశంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు. ఇందులో భాగంగా చైనాలోని ఓ రెస్టారెంట్లో​ ఈ పరిశోధనలు నిర్వహించారు. వీటిని పరిశీలించేందుకు సూపర్‌ కంప్యూటర్​లలో అధునాతన వాయు ప్రవాహ ఉత్పత్తులను వినియోగించినట్లు వారు తెలిపారు. ఈ పరిశోధనకు సంబంధించిన పత్రాలు తాజాగా ఫిజిక్స్‌ ఆఫ్‌ ఫ్లూయిడ్స్‌ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

ఎయిర్‌ కండిషనర్ల నుంచి వచ్చే చల్లటి గాలి ప్రవాహం ఆ గదిలో ఉన్న వేడి పదార్థాల నుంచి వచ్చే ఆవిరితో కలిసినపుడు జరిగే చర్యలు, ఈ ప్రక్రియలో కరోనా వైరస్‌ కణాలు ఏ విధంగా వ్యాపిస్తున్నాయి అనే అంశాలను ఈ పరిశోధనలో విశ్లేషించారు. "మా పరిశోధనలో గాలి ప్రవాహం, వేడి ప్రభావం, ఎయిర్‌ కండీషనర్ల సామర్థ్యం, ఏరోసోల్‌ వ్యాప్తి వంటి భౌతిక చర్యలతో పాటు వైరస్‌ వ్యాప్తికి ఉపకరించే అన్ని అంశాలను పరిశీలించాం." అని ఈ పరిశోధనలో సభ్యుడైన జియారోంగ్‌ హాంగ్‌ తెలిపారు.

కాంట్రాక్ట్​ ట్రేసింగ్​ ద్వారా..

ప్రస్తుతం కరోనా వైరస్‌ గాలిలో ఎలా వ్యాప్తి చెందుతుందన్న అంశంపై అనేక అధ్యయనాలు నిర్వహిస్తున్నారు. కంప్యూటర్‌ అనుకరణలను అనుసరించి ప్రయోగాలు చేయగా.. కాంట్రాక్ట్‌ ట్రేసింగ్‌ ద్వారా ప్రత్యక్షంగా వాస్తవ సంక్రమణ వ్యాప్తిని పరిశీలించామని హాంగ్‌ తెలిపారు. మా పరిశోధనలో అధునాతన గణన సాధనాలు ఏరోసోల్‌ వ్యాప్తి, వివిధ భౌతిక కారకాలను వాస్తవికంగా విశ్లేషించాయి అని ఆయన వెల్లడించారు.

రెండు కణాలుగా వ్యాప్తి..

రెస్టారెంట్లలో వైరస్‌ ఎక్కువగా వ్యాప్తి చెందే ప్రాంతాలు, నమోదైన కరోనా సంక్రమణ నమూనాల మధ్య ప్రత్యక్ష అనుసంధానం ఉన్నట్లు పేర్కొన్నారు హాంగ్​. తమ పరిశోధన ద్వారా రెస్టారంట్లలో వైరస్‌ కణాలు రెండు రకాలుగా వ్యాపిస్తున్నట్లు గుర్తించామన్నారు. అందులో ఒకటి బల్లల కింద నుంచి ప్రసరించే ఏరోసోల్‌ కణాలు పెరగడం, రెండోది ఏసీల ద్వారా అని వెల్లడించారు.
"మా పరిశోధన ద్వారా కరోనా వ్యాప్తి నివారణకు రెండు చర్యలను సూచిస్తున్నాం. ఒకటి బల్లలను కింది వరకూ కప్పి ఉంచడం, రెండోది ఏసీ వడపోత సామర్థ్యాల్ని పెంచడం. గాలి ద్వారా వైరస్‌ వ్యాపించే ప్రమాదాన్ని అంచనా వేయడం మా పరిశోధనలో కీలకాంశం." అని పరిశోధకులు వెల్లడించారు.

ఇదీ చదవండి: 200 మంది కేరళ విద్యార్థులకు కరోనా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.