Horoscope Today (05-04-2022): ఈ రోజు గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం; ఉత్తరాయణం; వసంత ఋతువు; చైత్రమాసం; శుక్లపక్షం
చవితి: మ. 2.35 తదుపరి పంచమి కృత్తిక: మ. 3.56 తదుపరి రోహిణి వర్జ్యం: లేదు
అమృత ఘడియలు: మ.1.19 నుంచి 3.03 వరకు దుర్ముహూర్తం: ఉ. 8.22 నుంచి 9.11 వరకు తిరిగి రా.10.52 నుంచి 11.39 వరకు
రాహుకాలం: మ.3.00 నుంచి 4.30 వరకు
సూర్యోదయం: ఉ.5.56, సూర్యాస్తమయం: సా.6.10
మేషం:
శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. కీలక వ్యవహారాల్లో శ్రద్ధ అవసరం. కుటుంబ సభ్యుల మాటలకు గౌరవం ఇవ్వడం మంచిది. నవగ్రహ ధ్యానం శుభప్రదం
వృషభం:
మీ మీ రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదైవధ్యానం శుభప్రదం.
మిథునం:
మీ మీ రంగాల్లో మనోధైర్యంతో ముందుకు సాగాలి. బుద్ధిబలాన్ని ఉపయోగించి ఆటంకాలను అధిగమిస్తారు. ఆత్మీయులతో ఆచితూచి వ్యవహరించాలి. వినాయకుడిని ఆరాధిస్తే మంచిది.
కర్కాటకం:
ప్రారంభించిన పనులను పట్టుదలతో పూర్తిచేస్తారు. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. కుటుంబంలో కాస్త ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది. దక్షిణామూర్తి స్తోత్రం చదివితే మంచిది.
సింహం:
స్వల్ప ప్రయత్నంతోనే గొప్ప ఫలితాలు పొందుతారు. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీ స్వధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. శ్రీవేంకటేశ్వరుడిని ఆరాధించడం వల్ల మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు.
కన్య:
మిశ్రమకాలం. అనవసర ఖర్చులు వచ్చే సూచనలు ఉన్నాయి. ముఖ్య విషయాల్లో ప్రశాంతంగా ఆలోచించండి. మంచి జరుగుతుంది. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదవాలి.
తుల:
వృత్తి,ఉద్యోగాల్లో శ్రమ ఫలిస్తుంది. ముఖ్య విషయాల్లో పరిరక్షణ అవసరం. అష్టమ చంద్ర సంచారం అనుకూలంగా లేదు. మానసిక ప్రశాంతత కోసం వేంకటేశ్వరస్వామి ఆలయ సందర్శనం శుభప్రదం.
వృశ్చికం:
ఒక శుభవార్త వింటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. బంధు,మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. షణ్ముఖ సుబ్రహ్మణ్యస్వామి దర్శనం మేలు చేస్తుంది.
ధనుస్సు:
ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేస్తారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. అనవసర వ్యవహారాల్లో తలదూర్చకుండా ఉండటం మేలు. నారాయణ మంత్రాన్ని జపించాలి.
మకరం:
మీ మీ రంగాల్లో శ్రమ పెరుగుతుంది. మనోవిచారాన్ని కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. గిట్టనివారితో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగకండి. శ్రీఆంజనేయ స్వామి అష్టోత్తర శతనామావళి చదవడం మంచిది.
కుంభం:
శ్రమతో కూడిన ఫలితాలు వస్తాయి. ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది. బంధు,మిత్రులను కలుస్తారు. ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. ఇష్టదైవారాధన శుభప్రదం.
మీనం:
అనుకున్న పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయగలుగుతారు. శారీరక శ్రమ పెరిగినా అందుకు తగిన ఫలితాలు లభించడం వల్ల సంతోషంగా ఉంటారు. దుర్గాస్తుతి చదవాలి.