Horoscope Today: ఈ రోజు(నవంబర్ 28) రాశి ఫలం గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఒక వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఆదిత్య హృదయం పఠించాలి.

చేపట్టే పనిలో బద్ధకాన్ని వీడాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అదిగించే ప్రయత్నం చేస్తారు. మీ కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. బందుమిత్రులతో విభేదాలు రావచ్చు. ఇష్టదేవతా స్తోత్రం పఠిస్తే బాగుంటుంది.

కీలక నిర్ణయాల్లో కుటుంబ సభ్యుల సహకారం మేలు చేస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగి పనులను పూర్తిచేస్తారు. ఇబ్బంది పెట్టే వారిని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకొనిపోతే ఇబ్బందులు ఉండవు. గణపతిని ఆరాధిస్తే ఆటంకాలు తొలగుతాయి.

ఇది అనుకూలమైన సమయం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీరు ఆశించే నిర్ణయాలు వస్తాయి. చేపట్టే పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆత్మవిశ్వసంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. లక్ష్మీఅష్టోత్తర శతనామావళి పఠిస్తే బాగుంటుంది.

తలపెట్టిన పనులు నిర్విరామంగా పూర్తవుతాయి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ ప్రతిభను పెద్దలు పెంచుకుంటారు. అవసరాలకు దానం చేకూరుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆదిత్య హృదయ పారాయణ చేయడం మంచిది.

శ్రద్ధగా పనిచేసి మంచి ఫలితాను అందుకుంటారు. ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. దగ్గరివారితో విభేదాలు రాకుండా చూసుకోవాలి. శారీరక శ్రమ పెరుగుతుంది. నవగ్రహ శ్లోకం చదవాలి.

మంచి పనులు చేపడతారు. గొప్ప వారితో సత్సాంగత్యం ఏర్పడుతుంది. కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.

ఒక శుభవార్త వింటారు. ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి కీలక విషయాలు చర్చిస్తారు. శివ అష్టోత్తర శతనామావళి పారాయణ చేయడం మంచిది.

ధర్మ సిద్ధి ఉంది. ఏ పని తలపెట్టినా వెంటనే పూర్తవుతుంది. కొన్ని కీలక వ్యవహారాలను వారితో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తిచేయగలుగుతారు. కొన్ని చర్చలు మీకు లాభిస్తాయి. ప్రసన్నాంజనేయ సోత్రం పారాయణ చేయాలి.

శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులకు స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. కొన్ని కీలకమైన వ్యవహారాలలో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. శని ధ్యానం చేయాలి.

తలపెట్టిన కార్యాన్ని పూర్తిచేస్తారు. ఉద్యోగ పరంగా అనుకూలంగా ఉంది. మితంగా ఖర్చుచేయాలి. శ్రమ కాస్త పెరుగుతుంది. కుటుంబసభ్యులతో ప్రేమగా మెలగాలి. సాయి నామాన్ని స్మరించండి.

శుభకాలం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అభివృద్ధికి సంబందించిన వార్త వింటారు. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. కనకధారాస్తవం పఠించాలి.