HOROSCOPE TODAY: ఈరోజు (నవంబర్ 13) మీ రాశిఫలం గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

మీ మీ రంగాల్లో అన్నీ మీకు అనుకూలంగా వెలువడతాయి. కీలక సమయాలలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఆంజనేయ ఆరాధన మంచిది.

ఉత్సాహంగా పనిచేయాల్సిన సమయం ఇది. కొన్ని పనులను ప్రారంభించి పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ప్రయాణాలు తప్పకపోవచ్చు. వృథా ఖర్చులు ఉన్నాయి. గోసేవ చేయాలి.

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు. విందు,వినోద, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. దైవారాధన మానవద్దు.

ప్రారంభించిన కార్యక్రమాలు నలుగురికీ ఆదర్శప్రాయంగా ఉంటాయి. మీదైన రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబ సౌఖ్యం కలదు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సూర్యారాధన ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

ఒక ముఖ్యమైన విషయంలో మీరు ఆశించిన పురోగతి ఉంటుంది.మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ప్రారంభించిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. గణపతి స్తోత్రం చదివితే ఇంకా బాగుంటుంది.

చేపట్టిన పనులను పట్టుదలతో పూర్తిచేస్తారు. కుటుంబసభ్యుల సహకారంతో అనుకున్నది సాధిస్తారు. అధికారులతో మాత్రం అంటీముట్టనట్టు ఉండటమే మంచిది. దక్షిణామూర్తి స్తోత్రం చదివితే మంచిది.

వృత్తి,ఉద్యోగ,వ్యాపార రంగాల్లో ఆచితూచి వ్యవహరించాలి.కొత్త పనులను ప్రారంభించే ముందు మంచీ,చెడులను ఆలోచించి ముందుకు సాగండి. కీలక వ్యవహారంలో ముందుచూపు అవసరం. దైవబలం రక్షిస్తోంది. విష్ణు సందర్శనం శుభప్రదం.

మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారులు మీకు అనుకూలమైన ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు.కొన్ని కీలకమైన పనులను పూర్తిచేయగలుగుతారు. కీలక నిర్ణయాలు ఫలిస్తాయి.శివస్తోత్రం చదివితే మంచిది.

శుభ ఫలితాలు కలవు. కొత్త పనులను ప్రారంభిస్తారు. పెద్దల ఆశీర్వచనాలు ఫలిస్తాయి. సమస్యగా అనిపించిన అంశాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు. ప్రయాణాలు శుభప్రదం. ఇష్టదేవతను ఆరాధిస్తే మంచిది.

ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. కీలక బాధ్యతలు మీ భుజాన పడతాయి.వాటిని సమర్థంగా నిర్వహించి అందరి ప్రశంసలు పొందుతారు. విందూ, వినోద ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.శివారాధన శుభప్రదం.

శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. తోటివారి సహకారం ఉంది. సమయానికి ఆహారంతో పాటు విశ్రాంతి తీసుకోవాలి. ఖర్చులు పెరుగుతాయి.శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన శ్రేయోదాయకం.

బంధు,మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు.చంద్రధ్యానం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
ఇదీ చదవండి:ఎలక్ట్రిక్ హెల్మెట్.. బైక్ చోరీ అవ్వదు.. పెట్టుకోకుంటే బండి కదలదు!
దిల్లీలో భూకంపం.. భయంతో జనం పరుగులు.. ఆ ప్రాంతంలోనూ ప్రకంపనలు