Horoscope Today January 5th 2024 : జనవరి 5 (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) : మేషరాశివారు ఈ రోజు సంతోషంగా ఉంటారు. ప్రతి రంగంలోనూ విజేతగా నిలుస్తారు. మీ ఇంట్లో స్నేహపూర్వకమైన వాతావరణం ఉంటుంది. ఇవాళ మీ స్నేహితులు, కుటుంబం సభ్యులతో సరదాగా విహారయాత్రకు వెళ్లండి. సమాజంలో మీ గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగులు ఈ రోజు రాణిస్తారు. ఆర్థికంగా లాభపడతారు.
వృషభం (Taurus) : ఈ రోజు వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రయత్నించండి. విద్యార్థులకు ఇవాళ అంతగా కలిసిరాదు. స్కూల్లో ఇతర విద్యార్థులతో గొడవలు జరగొచ్చు. మధ్యాహ్నానికి కొంత మేర బాగానే ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. మీ ఆఫీసులోని సహోద్యోగులు మీకు సాయపడతారు.
మిథునం (Gemini) : మీ కుటుంబ సభ్యులపై కోపం చూపించవద్దు. సహనం వహించండి. రోజంతా శాంతంగా ఉండండి. మీ ఇంట్లో ఉన్న ఘర్షణ వాతావారణం వృత్తిపై పడకుండా చూసుకోండి. విద్యార్థులు లక్ష్యాన్ని మర్చిపోవద్దు. ఇవాళ మిథున రాశివారు అనుకోని ఖర్చులు పెడతారు.
కర్కాటకం (Cancer) : ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. ఉదయం పూట మీరు ప్రతి రంగంలోనూ చాలా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. కానీ మధ్యాహ్న సమయానికి మీకు ఏ విషయాల్లోనూ ఫలితం దక్కదు. ధ్యానం చెయ్యండి. మీరు ఈ రోజు చాలా సెన్సిటివ్‌గా ఉంటారు. ఒత్తిడి, తీవ్ర ఆందోళనకు గురవుతారు. మీకూ, మీ కుటుంబ సభ్యులకూ మధ్య జరిగే గొడవలు తారా స్థాయికి చేరుకుంటాయి. ఈ రోజు మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.
సింహం (Leo) : ఇవాళ సింహరాశివారు తమ వైఖరితో ఇతరుల మనసును గెలుచుకుంటారు. మీ సహోద్యోగులు, స్నేహితుల నుంచి సాయం పొందుతారు. అందుకే మీరు ప్రతి పనిలోనూ విజేతగా నిలుస్తారు. కుటుంబ సభ్యులపై కోపాన్ని చూపించవద్దు. సమాజంలో మీ గౌరవమర్యాదలు ఈ రోజు పెరుగుతాయి. ఈ రోజు కాస్త ఆచితూచీ వ్యవహరించండి.
కన్య (Virgo) : కన్య రాశివారికి ఈ రోజు బాగా కలిసివస్తుంది. మీ మాటతీరుతో ఇతరుల్ని ఆకట్టుకుంటారు. ఈ క్రమంలో అందరి ప్రేమను పొందుతారు. మీరు చర్చల్లో పాల్గొనే అవకాశం ఉంది. వ్యాపారులు ఈ రోజు లాభపడతారు.
తుల (Libra) : తులరాశివారికి ఈ రోజు చికాకుగా ఉంటుంది. మానసికంగానూ, శారీరికంగానూ బాగా అలిసిపోతారు. ఎదుటివారిపై కోపాన్ని చూపించవద్దు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో గొడవలకు దిగవద్దు. మీ ఆరోగ్యం ఈ రోజు బాగానే ఉంటుంది. వీలైనంత వరకు న్యాయవివాదాలు జోలికి వెళ్లవద్దు.
వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశివారి తారాబలం ఈ రోజు బాగుంటుంది. ఆర్థికంగా లాభపడతారు. ఫ్రెండ్స్, మీకు ఇష్టమైనవారితో షికారుకు వెళ్లే అవకాశం ఉంది. కానీ ఖర్చు విషయంలో జాగ్రత్త వహించండి. మధ్యాహ్నం తర్వాత మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. మీ చుట్టుపక్కల కొందరు అహంకార స్వభావం ఉండేవారు ఉంటారు జాగ్రత్త. వారితో గొడవలు పెట్టుకోవద్దు.
ధనుస్సు (Sagittarius) : ఇవాళ ధనుస్సు రాశివారికి కలిసివస్తుంది. అన్ని రంగాల్లోనూ రాణిస్తారు. ఈ రోజు మీకు ప్రశాంతంగా గడిచిపోతుంది. స్నేహితులు, ఫ్యామిలీతో విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. జీతం పెంపు, ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సమాజంలో మీ గౌరవమర్యాదలు పెరుగుతాయి.
మకరం (Capricorn) : ఈ రోజు మకర రాశివారికి బాగుంటుంది. మీరు కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడానకి ఇది మంచిరోజు. వ్యాపారులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. దేవాలయాలకు, తీర్థయాత్రలకు వెళ్లండి. విదేశాల్లో నివసించే బంధువుల నుంచి శుభవార్త వింటారు.
కుంభం (Aquarius) : కుంభరాశివారు మంచి వైఖరితో ఉంటారు. తమ ప్రవర్తనతో ఇతరులను ఆకట్టుకుంటారు. కోపాన్ని అదుపులో ఉంచుకోగలిగితే మీకు అంతటా విజయమే. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. మీ ఫ్రెండ్స్ ఇంటికి వస్తారు వారితో కాసేపు సరదాగా గడపండి.
మీనం (Pisces) : ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉదయం బాగానే ఉంటుంది. సాయంత్రం కాస్త ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారంలో రాణిస్తారు. ఇంట్లో వారితో గొడవలకు దిగవద్దు.