Horoscope Today: ఈ రోజు(జవవరి 29) రాశి ఫలాల గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

ప్రారంభించిన పనులలో విజయావకాశాలు అధికంగా ఉన్నాయి. ఒక వ్యవహారంలో సహాయం అందుతుంది. ఒక శుభవార్త మీ మనోవిశ్వాసాన్ని పెంచుతుంది. పెద్దల ఆశీర్వచనాలు అందుతాయి. దైవబలం సంపూర్ణంగా ఉంది. ఇష్టదైవారాధన శుభప్రదం.

మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. రక్తసంబంధీకులతో ఆచితూచి వ్యవహరించాలి. శ్రమ అధికం అవుతుంది. ప్రయాణాల్లో అజాగ్రత్త వద్దు. దత్తాత్రేయ స్వామి ఆరాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది.

ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. విందు,వినోదాల్లో పాల్గొంటారు. మీ పనితీరుతో అందరి మనసులను గెలుచుకుంటారు. అపరిచితులను అతిగా నమ్మకండి. శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం.

మంచి సమయం. మనఃస్సౌఖ్యం ఉంది. నూతన వస్తుప్రాప్తి కలదు. అవసరానికి సహాయం చేసేవారున్నారు. బంధుప్రీతి కలదు. స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాల్లో సత్ఫలితాలను సాధిస్తారు. ఇష్టదైవనామస్మరణ ఉత్తమం.

చేపట్టే పనిలో శ్రమ పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. మీరంటే గిట్టని వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. కలహాలకు తావివ్వకండి. శ్రీవేంకటేశ్వరస్వామి సందర్శనం మేలు చేస్తుంది.

పనులకు ఆటంకాలు పెరుగుతాయి. ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మాటకు ఎదురెళ్లకుండా ఉండటం మంచిది. చంచల స్వభావంతో ఇబ్బందులు పడతారు. బంధు,మిత్రులతో విబేధాలు రావచ్చు. చంద్ర శ్లోకం చదవాలి.

శ్రమ అధికం అవుతుంది. అనవసర ఖర్చులు సూచితం. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. నవగ్రహ శ్లోకాలు చదివితే మంచిది.

మీ మీ రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం నెలకొంటుంది. సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. ఒక వార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. అనవసర విషయాల్లో తలదూర్చరాదు. నరసింహస్వామి ఆరాధన శుభప్రదం.

బాధ్యతలను గుర్తించి పనిచేయాలి. తోటి వారి సహకారంతో ఒక ఇబ్బంది నుంచి బయటపడతారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. అనవసర విషయాల్లో కలుగచేసుకోకుండా ఉండడం మంచిది. హనుమాన్ చాలీసా చదివితే సత్ఫలితాలు వస్తాయి.

కొందరి వల్ల ఆటంకాలు ఎదురవుతాయి. చెడు తలంపులు వద్దు. కీలక విషయాల్లో నిపుణులను సంప్రదించడం మంచిది. అప్పుల విషయంలో జాగ్రత్త. కలహాలకు తావివ్వరాదు. శివారాధన ఉత్తమం.

శుభకాలం. మీ మీ రంగాల్లో మంచి ఫలితాలు ఉన్నాయి. నిర్ణీత కాలంలో పనులను పూర్తిచేస్తారు. పెద్దల ఆశీస్సులు ఉంటాయి. తోటివారి సహాయ సహకారాలు ఉంటాయి. శ్రీలక్ష్మీ గణపతి ఆరాధన శుభప్రదం.

ఉద్యోగం విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. చక్కటి ఆలోచనా విధానంతో ముందుకు సాగి మంచిపేరు సంపాదిస్తారు. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. శివ నామస్మరణ తో ఆపదలు తొలగిపోతాయి. ఉత్తమ ఫలితాలను వస్తాయి.