Horoscope Today : ఈ రోజు రాశి ఫలం(డిసెంబరు 31) గురించి శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
![](https://assets.eenadu.net/article_img/mesham_2_4.jpg)
ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కీలకమైన పనులను కొన్నాళ్ల పాటు వాయిదా వేయడమే మంచిది. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. దుర్గా ఆరాధన శుభప్రదం.
![](https://assets.eenadu.net/article_img/vrushabam_5.jpg)
విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది. భవిష్యత్తు ప్రణాళికలలో కొన్నింటిని అమలు చేయగలుగుతారు. సొంతింటి పనుల్లో ముందంజ వేయగలుగుతారు. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. దుర్గాధ్యానం శుభకరం.
![](https://assets.eenadu.net/article_img/midhunam_5.jpg)
మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు. మీరు ఎప్పటినుంచో చేయాలనుకుంటున్న ఒక ముఖ్యమైన పని దాదాపుగా పూర్తి కావొస్తుంది. శ్రీమహాలక్ష్మి అష్టోత్తరం చదివితే మంచిది.
![](https://assets.eenadu.net/article_img/karkatakam_2_4.jpg)
ప్రారంభించిన పనుల్లో విఘ్నాలు పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. ముఖ్య విషయాల్లో అనుకూల నిర్ణయాలు వెలువడతాయి. అధికారుల సహకారం ఉంటుంది. శివస్తోత్రం చదవడం మంచిది.
![](https://assets.eenadu.net/article_img/simham_1_4.jpg)
ప్రారంభించబోయే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఆర్థిక విషయాల్లో పొదుపు సూత్రాన్ని పాటించాలి. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు. శ్రీవేంకటేశ్వరుని ఆరాధన వల్ల ఆపద తొలగుతాయి.
![](https://assets.eenadu.net/article_img/kanya_1_4.jpg)
శుభకాలం. మీ ప్రతిభ,పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. ఇష్టదైవారాధన మంచిది.
![](https://assets.eenadu.net/article_img/tula_1_4.jpg)
చేపట్టే పనిలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. బంధువుల సహకారం ఉంటుంది. కీలక వ్యవహారాల్లో ముందుచూపు అవసరం. హనుమాన్ చాలీసా చదవడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు.
![](https://assets.eenadu.net/article_img/vruschikam_6.jpg)
శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. వృత్తి,ఉద్యోగ,వ్యాపార,విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరు. దైవారాధన మానవద్దు.
![](https://assets.eenadu.net/article_img/dhanussu_5.jpg)
మనోధైర్యంతో ముందుకు సాగి పనులను పూర్తిచేస్తారు. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ప్రయాణాల్లో అజాగ్రత్త వద్దు. శ్రీవేంకటేశ్వర స్వామి సందర్శనం ఉత్తమం.
![](https://assets.eenadu.net/article_img/makaram_3_3.jpg)
మీ మీ రంగాల్లో ఓర్పు,పట్టుదల చాలా అవసరం. బంధువులతో వాదనలకు దిగడం వల్ల విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అవసరాలకు మించిన ఖర్చులు ఉంటాయి. నవగ్రహ ఆలయ సందర్శనం శుభప్రదం.
![](https://assets.eenadu.net/article_img/kumbam_1_5.jpg)
పట్టుదలతో పనులను పూర్తిచేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. కొన్ని సమయాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. గోవింద నామాలు చదవడం వల్ల ఆపదలు తొలగి అంతా బాగుంటుంది.
![](https://assets.eenadu.net/article_img/meenam_2_5.jpg)
ఆశించిన ఫలితాలు ఉన్నాయి. ఒక వ్యవహారంలో సహాయం అందుతుంది. ఒక శుభవార్త మీ మనోవిశ్వాసాన్ని పెంచుతుంది. దైవబలం ఉంది. ఇష్టదైవారాధన శుభప్రదం.