Horoscope Today: ఈ రోజు(డిసెంబర్ 02) రాశి ఫలం గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
ప్రారంభించబోయే పనులకు ఆటంకాలు ఎదురవకుండా చూసుకోవాలి. మీ అభివృద్ధికి దోహదపడే ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు. అకారణ కలహ సూచన. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వస్తాయి. హనుమాన్ చాలీసా చదవడం మంచిది.
ప్రారంభించిన కార్యక్రమాల్లో విజయసిద్ధి ఉంది. ఒక శుభవార్త ఉత్సాహాన్ని ఇస్తుంది. విందు,వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. తోటివారి సహాయసహకారాలు ఉన్నాయి. దైవబలం రక్షిస్తోంది. శ్రీ వేంకటేశ్వర సందర్శనం శుభప్రదం.
శుభప్రదమైన కాలాన్ని గడుపుతారు. బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. సాయిబాబా వారి సచ్చరిత్ర పారాయణ శుభప్రదం.
ప్రారంభించబోయే పనుల్లో పట్టుదల వదలకండి. ఉద్యోగంలో పై అధికారులతో నమ్రతగా వ్యవహరించాలి. గిట్టనివారు మీ ఉత్సాహంపై నీళ్లు చల్లుతారు. మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. దైవధ్యానంతో ఆపదల నుంచి బయటపడతారు.
మనసు పెట్టి పనిచేస్తే విజయం మీదే. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. శ్రమ అధికం అవుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. దత్తాత్రేయస్వామి ఆరాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది.
లక్ష్యాలకు కట్టుబడి పనిచేస్తారు. ధర్మసందేహాలతో కాలాన్ని వృథా చేయకండి. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. మనోవిచారం కలుగకుండా చూసుకోవాలి. ప్రయాణంలో ఆటంకాలు కలుగుతాయి. శివారాధన శుభప్రదం.
ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఒక వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. బుద్ధిబలం బాగుంటుంది. కీలక సమయాలలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదవడం మంచిది.
పనులకు ఆటంకాలు కలుగకుండా చూసుకోవాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఓర్పు చాలా అవసరం. అనవసర భయాందోళనలను దరిచేరనీయకండి. నవగ్రహ ధ్యానశ్లోకం చదివితే మంచిది.
రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలి. సమన్వయలోపం లేకుండా చూసుకోవాలి. సమర్థతను పెంచాలి. ఆవేశంతో నిర్ణయాలు తీసుకోరాదు. ప్రశాంతమైన ఆలోచనలతో గొప్పవారవుతారు. ఆత్మీయులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. శ్రీవేంకటేశ్వరుని సందర్శనం శుభప్రదం.
శుభకాలం. మనోధైర్యంతో అనుకున్నది సాధిస్తారు. ఒక పనిలో మీకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. అర్ధ,వస్త్ర లాభాలు ఉన్నాయి.ఇష్టదేవతా శ్లోకాలు చదివితే బాగుంటుంది.
ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ముఖ్య వ్యవహారంలో పెద్దలను కలుస్తారు. నిర్ణయం మీకు అనుకూలంగా రాకపోవచ్చు. బంధుమిత్రులను కలుస్తారు. దత్తాత్రేయ స్తోత్రం చదివితే మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.
మంచి ఫలితాలను సాధిస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. అభివృద్ధి కోసం మీరు తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. శివారాధన శుభకరం.