Horoscope Today: ఈ రోజు రాశి ఫలం గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే.
మిశ్రమ వాతావరణం కలదు. బుద్ధిబలంతో వ్యవహరిస్తే ఆటంకాలు దూరమవుతాయి. ఎలాంటి పరిస్థితులలోనూ మనో దైర్యాన్ని కోల్పోరాదు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. శత్రువుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. అనవసరంగా ఆందోళన పడతారు. దైవారాధన మానవద్దు.
మొదలుపెట్టిన పనులను పూర్తిచేయడానికి చిత్తశుద్ధి చాలా అవసరం. అనవసర విషయాలతో కాలాన్ని వృథాచేయకండి. సాహసోపేతమైన విజయాలున్నాయి. శివ ఆరాధన మంచి చేస్తుంది.
చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. ఆర్ధికాభివృద్ధికోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. శారీరక శ్రమ అధికమవుతుంది. వాదులాటలకు దూరంగా ఉండటమే మంచిది. శని శ్లోకాన్ని చదవండి.
చేపట్టే పనుల్లో మంచి ఫలితాలు రాబడతారు. మీ మీ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఇష్టులతో కాలాన్ని గడుపుతారు. ఆంజనేయుడినీ ఆరాధిస్తే మంచిది.
చక్కటి ఆలోచనలతో ముందుకు సాగండి. కొన్నాళ్లుగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుంది. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వస్తాయి. గణపతి ఆరాధన శుభప్రదం.
ఉత్సాహంగా పనిచేయాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆచితూచి మాట్లాడాలి. ఆరోగ్యం సహకరిస్తుంది. రామ నామాన్ని స్మరించండి.
చేపట్టిన పనులలో ఆటంకాలు తొలుగుతయి. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఒక వార్త ఆనందాన్నిస్తుంది. ఒత్తిడి పెరగకుండా ముందుచూపుతో వ్యవహరిస్తే మేలు చేకూరుతుంది. కనకధారాస్తవం పఠించాలి.
వృత్తి ఉద్యోగ వ్యపారాలలో మీ అభివృద్ధికి సంబందించిన శుభవార్తలు వింటారు. వ్యాపార లాభాలున్నాయి. సమయ పాలనతో అనుకున్న పనులను పూర్తిచేస్తారు. విష్ణు ఆలయ సందర్శనం శుభప్రదం.
చేపట్టిన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. బుద్ధిబలంతో విజయాన్ని సాధిస్తారు. కుటుంబ సహకారం ఉంది. దైవబలం రక్షిస్తోంది. ఇష్టదైవం సందర్శనం శుభప్రదం..
మిశ్రమ వాతావరణం ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఒత్తిడిని తట్టుకోలేక అధికారుల దగ్గర ఇబ్బందులుపడతారు. చేపట్టే పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కుటుంబంలో పొరపొచ్చలు వచ్చే అవకాశం ఉంది. హనుమాన్ చాలీసా పఠిస్తే మంచిది.
వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. దుర్గాస్తుతి పఠిస్తే మంచిది.
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో అనుకూలమైన ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. కొన్ని సంఘటనలు మీ మనోధైర్యాన్ని పెంచుతాయి. కుటుంబ సభ్యుల సంపూర్ణ సహకారం లభిస్తుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. దైవారాధన మానవద్దు.