
చక్కటి ఆలోచనా విధానంతో అనుకున్నది సాధిస్తారు. నూతన కార్యక్రమాలను చేపడతారు. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. లక్ష్మీదేవిని ఆరాధిస్తే శుభఫలితాలు ఉంటాయి.

తలపెట్టిన కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. కొందరి ప్రవర్తన కాస్త బాధ కలిగిస్తుంది. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు వస్తాయి. కోపాన్ని కాస్త తగ్గించుకుంటే మంచిది. గోసేవ చేస్తే బాగుంటుంది.

కీలక వ్యవహారాల్లో పెద్దలను కలుస్తారు. నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనవసర ధన వ్యయం సూచితం. బంధువులతో వాదనలకు దిగడం వలన విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఇష్టదేవతా స్తోత్రం పారాయణ చేస్తే మంచిది.

ధర్మసిద్ది ఉంది. బంధువుల సహకారం అందుతుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. దైవారాధన మానవద్దు.

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తిచేయగలుగుతారు. ప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణ చేయాలి.

మీ మీ రంగాల్లో ఆశించిన ఫలితాలు ఉంటాయి. సన్నిహితుల వల్ల మేలు జరుగుతుంది. ముఖ్య విషయాల్లో మీ మనస్సు చెప్పిన విధంగా నడుచుకోండి. సత్ఫలితాలు సాధిస్తారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సుబ్రహ్మణ్యస్వామిని పూజించడం మంచి ఫలితాలను ఇస్తుంది.

చేపట్టే పనుల్లో శ్రమ పెరుగుతుంది. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్ధిక విషయాల్లో ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. రామరక్షా స్తోత్రం చదవడం వల్ల ఆపదలు తొలగుతాయి.

పనుల్లో జాప్యం జరగకుండా చూసుకోవాలి. కుటుంబ భాద్యతలు అధికం అవుతాయి. ఒక పరీక్షలాగా వాటిని ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ అంచనాలు తప్పుతాయి. విలువైన వస్తువుల విషయాలలో అజాగ్రత్త పనికి రాదు. ఆదిత్య హృదయం చదవడం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి.
భవిష్యత్ ప్రణాళికలను అమలు చేస్తారు. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. మనోధైర్యంతో చేసే పనులు కలిసి వస్తాయి. ఓర్పు తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆంజనేయ స్వామి దర్శనం మంచి ఫలితాలను ఇస్తుంది.

అదృష్ట ఫలాలు అందుతాయి. అధికారులు మీకు అనుకూలమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. కీలక వ్యవహారాలు కలిసి వస్తాయి. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం.

అనుకున్న పనులు నెరవేరుతాయి. మనఃసౌఖ్యం ఉంటుంది. మీ పై అధికారుల సహకారం ఉంటుంది. అర్థలాభం ఉంది. ధర్మసిద్ధి కలదు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఇష్టదైవారాధన శుభప్రదం.

చేపట్టే పనుల్లో అలసట పెరగకుండా చూసుకోవాలి. అస్థిరబుద్ది వల్ల ఇబ్బందులకు గురవుతారు. కీలక సందర్భాల్లో పెద్దలు చెప్పే అనుభవ సూత్రాలు అమృతగుళికల్లా పనిచేస్తాయి. మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన మేలైన ఫలితాలను ఇస్తుంది.