మనోధైర్యంతో ప్రయత్నించి కార్యాలు సాధిస్తారు. ఉత్సాహం తగ్గకుండా పనిచేయాలి. బంధుమిత్రులను కలుస్తారు. ఆరోగ్యం పై శ్రద్ధ అవసరం. చంద్రశేఖరాష్టకాన్ని చదివితే మంచిది.
ధనలాభం ఉంది. ఒక విషయంలో మనః సంతోషాన్ని పొందుతారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థిక లాభాలున్నాయి. విష్ణు సహస్రనామాలు చదివితే మంచి జరుగుతుంది.
వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆచితూచి అడుగేయాలి. చేపట్టే పనులలో కొన్ని ఇబ్బందులు పెరగకుండా చూసుకోవాలి. బంధుమిత్రులతో జాగ్రత్తగా మాట్లాడాలి. దుర్గాదేవిని పూజిస్తే శుభఫలితాలు కలుగుతాయి.
మనఃసౌఖ్యం కలదు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని కీలక నిర్ణయాలలో వారి సహకారం మీకు లబిస్తుంది. వేంకటేశ్వరుడిని పూజిస్తే మంచిది.
మంచి మనస్సుతో చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సుఖసంతోషాలతో గడుపుతారు. ఆర్థికంగా ప్రయోజనాలుంటాయి. వివాదాస్పద వ్యక్తులకు దూరంగా ఉండాలి. శివారాధన మేలు చేస్తుంది.
ఆత్మశుద్ధితో పనిచేసి విజయాలను సొంతం చేసుకుంటారు. తరుచూ నిర్ణయాలు మార్చడం ద్వారా ఇబ్బందులు ఎదురవుతాయి. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.
ఉద్యోగంలో జాగ్రత్తగా పనిచేయాలి. అధికారులు మీకు అంత అనుకూలంగా ఉండకపోవచ్చును. అనవసర ఖర్చలు, కలహ సూచితం. నిర్ణయాలలో స్తిరత్వం ఉండదు. కలహాలకు దూరంగా ఉండాలి. శని శ్లోకం పఠిస్తే శుభఫలితాలు కలుగుతాయి.
గ్రహబలం బాగుంది. తలపెట్టిన పనులు చాలా సులువుగా పూర్తవుతాయి. ఒక ముఖ్య వ్యవహరంలో ఆర్థిక సాయం అందుతుంది. అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. కొన్ని వ్యవహారాలలో దైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఇష్టదైవారాధన శుభప్రదం.
శుభకార్యాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల నుంచి ఒక ముఖ్య వ్యవహారంలో సంపూర్ణ సహకారం లభిస్తుంది. అవసరానికి తగిన సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వసాన్ని పెంచుతుంది. సూర్యాష్టకం చదివితే బాగుంటుంది.
చేపట్టే పనుల్లో శ్రమపెరుగుతుంది. ఉత్సాహంగా ముందుకు సాగితే మంచి జరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. మనోబలం కోసం దుర్గా అష్టోత్తర శతనామావళి పఠిస్తే బాగుంటుంది.
ముఖ్యవిషయాల్లో చంచలస్వభావాన్ని రానీయకండి. అనుభవజ్ఞులసూచనలతో ఆర్థిక లాభం పొందుతారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ధర్మ సిద్ధి ఉంది. ఉద్యోగంలో స్వస్థాన ప్రాప్తి కలదు. సంకటహర గణపతి స్తోత్రం పఠిస్తే బాగుంటుంది
శ్రద్దగా పనిచేస్తే విజయం తప్పక వరిస్తుంది. ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. కొన్ని సంఘటనల వల్ల ఉత్సాహం తగ్గుతుంది. మీ అభివృద్ధికి ఆటంకం కలిగించే విషయాలకు దూరంగా ఉండాలి. దుర్గారాధన చేస్తే మంచిది.