ఈరోజు(11-11-2021) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల (Horoscope Today) వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి..
శ్రీ ప్లవనామ సంవత్సరం; దక్షిణాయనం శరదృతువు; కార్తీక మాసం; శుక్లపక్షం
సప్తమి: మ. 12.01 తదుపరి అష్టమి
శ్రవణం: రా. 8.33 తదుపరి ధనిష్ఠ
వర్జ్యం: రా. 12.26 నుంచి 1.59 వరకు
అమృత ఘడియలు: ఉ.10.36 నుంచి 12.08 వరకు
దుర్ముహూర్తం: ఉ. 9.51 నుంచి 10.36 వరకు తిరిగి మ. 2.21 నుంచి 3.06 వరకు
రాహుకాలం: మ. 3.00 నుంచి 4.30 వరకు
సూర్యోదయం: ఉ.6.06, సూర్యాస్తమయం: సా.5-22
మేషం
కుటుంబ సహకారంతో చేసే పనులు మేలు చేస్తాయి. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ముఖ్య వ్యవహారాల్లో నిర్లక్ష్యం చేయవద్దు. గోసేవ చేయాలి.
వృషభం
తోటివారిని కలుపుకొనిపోతే పనులు త్వరగా పూర్తవుతాయి. ఒత్తిడిని జయిస్తారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. పెద్దల ఆశీర్వచనాలు ఉన్నాయి. శివుడిని ఆరాధిస్తే మంచిది.
మిథునం
మిశ్రమ వాతావరణం ఉంటుంది. అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. అనవసర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. నవగ్రహ ఆరాధన శుభప్రదం.
కర్కాటకం
శుభకాలం. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు. ఒక వ్యవహారంలో శుభఫలాన్ని అందుకుంటారు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తిచేస్తారు. ఇష్టదైవ ధ్యానం శుభప్రదం.
సింహం
గొప్ప సంకల్పబలంతో ముందుకు సాగి సత్పలితాలను అందుకుంటారు. కాలం అన్నివిధాలుగా సహకరిస్తోంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం మంచిది.
కన్య
సంపూర్ణ మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. ఒక వార్త బాధ కలిగిస్తుంది. ఇబ్బంది పెడుతున్న సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. శత్రువుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి.ఆంజనేయస్వామిని ఆరాధించాలి.
తుల
ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఎలాంటి పరిస్థితులలోనూ మనోధైర్యాన్ని కోల్పోరు. ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్దంగా పూర్తిచేస్తారు. కొన్ని కీలకమైన ప్రణాళికలు వేసి, వాటిని ప్రారంభిస్తారు. శ్రీ వేంకటేశ్వర శరణాగతిస్తోత్రం పఠనం మంచిది.
వృశ్చికం
బంధు,మిత్రులను కలుస్తారు. కొన్ని కీలక వ్యవహారాలను వారితో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తి చేయగలుగుతారు. కొన్ని చర్చలు లాభిస్తాయి. ప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణ చేయాలి.
ధనుస్సు
మనోబలంతో చేసే పనులు విజయాన్ని చేకూరుస్తాయి. కొత్త పనులను ప్రారంభించడానికి ఇది సరైన సమయం. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. బంధు,మిత్రుల ఆదరణ ఉంటుంది. దైవారాధన మానవద్దు.
మకరం
ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. చక్కటి ఫలితాలను పొందుతారు. బుద్ధిబలం బాగుండటం వల్ల కొన్ని కీలక వ్యవహారాల నుంచి బయటపడగలుగుతారు. మీ ప్రతిష్టకు మచ్చ తెచ్చేందుకు కొందరు ప్రయత్నిస్తారు జాగ్రత్త. దైవారాధన మానవద్దు.
కుంభం
ప్రారంభించబోయే పనుల్లో శారీరక శ్రమ పెరుగుతుంది. తోటివారితో విబేధాలు రాకుండా చూసుకోవాలి. అనవసరంగా కష్టాలను కొని తెచ్చుకుంటారు. కొన్ని పరిస్థితులు మనోవిచారాన్ని కలిగిస్తాయి. నవగ్రహ ధ్యానం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.
మీనం
ముఖ్య విషయాల్లో అనుకూల నిర్ణయాలు వెలువడతాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి అనుకూలతను సాధిస్తారు. మనఃసౌఖ్యం ఉంది. శివ స్తోత్రం పఠనం శుభప్రదం.