Horoscope Today(27-05-2022): ఈ రోజు గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం; ఉత్తరాయణం; వసంత ఋతువు; వైశాఖమాసం;
బహుళపక్షం ద్వాదశి: మ.12-55 తదుపరి త్రయోదశి; అశ్విని: తె.3-21 తదుపరి భరణి;
వర్జ్యం: రా.11-12 నుంచి 12-52 వరకు;
అమృత ఘడియలు:రా.7-53 నుంచి 9-33 వరకు;
దుర్ముహూర్తం: ఉ.8-03 నుంచి 8-55 వరకు; తిరిగి మ.12-21 నుంచి 1-13 వరకు;
రాహుకాలం: ఉ.10-30 నుంచి 12-00 వరకు;
సూర్యోదయం: ఉ.5.29, సూర్యాస్తమయం: సా.6.24
మేషం
మంచి పనులు చేపడతారు. కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.
వృషభం
మధ్యమ ఫలితాలు ఉన్నాయి. పక్కవారిని కలుపుకొనిపోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. దుర్గా ధ్యానశ్లోకం చదివితే మంచి జరుగుతుంది.
మిథునం
మనఃస్సౌఖ్యం ఉంది. భవిష్యత్తు ప్రణాళికలో స్పష్టత వస్తుంది. తోటివారితో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయానికి తగ్గ వ్యయం ఉంటుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. శివ నామస్మరణ ఉత్తమం.
కర్కాటకం
శుభకాలం. కీర్తి పెరుగుతుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.
సింహం
కృషికి తగ్గ ఫలితాలు ఉన్నాయి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సహకారం అందుతుంది. బంధుప్రీతి కలదు. ఈశ్వర సందర్శనం శుభప్రదం.
కన్య
కొన్ని కీలకమైన వ్యవహారాలలో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. పెద్దలతో కాస్త సంయమనంతో ఆచితూచి వ్యవహరించాలి. శివ అష్టోత్తర శతనామావళి పారాయణ మంచిది.
తుల
బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. మీ మీ రంగాల్లో అధికారుల ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. శివ నామస్మరణ చేస్తే మేలు.
వృశ్చికం
శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులను పూర్తిచేస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.
ధనుస్సు
మిశ్రమ ఫలాలు ఉన్నాయి. వాదప్రతివాదాల జోలికి పోకుండా ఉండటం మేలు. గోసేవ చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అపమృత్యు భయం వల్ల మనశ్శాంతి తగ్గుతుంది.శనిశ్లోకం చదవాలి.
మకరం
ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. కొందరిని అతిగా నమ్మడం మంచిది కాదు. సూర్య నమస్కారం ఆత్మశక్తిని పెంచుతుంది.
కుంభం
పనుల్లో విజయం సాధిస్తారు. తోటివారి సహకారంతో ఆటంకాలను అధిగమిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఇష్టదైవ స్తోత్రాన్ని చదవడం మంచిది.
మీనం
పట్టుదలతో అనుకున్న పని నెరవేరుతుంది. ముఖ్య విషయాల్లో పురోగతి సాధిస్తారు. అందరినీ కలుపుకొనిపోవడం వల్ల లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు. ప్రయాణంలో అశ్రద్ధ వద్దు. ఇష్టదైవ ధ్యానం మేలు చేస్తుంది.
ఇదీ చూడండి: Weekly Horoscope: ఈ వారం రాశి ఫలాలు (మే 22 - 28)